ETV Bharat / state

ఆకలేస్తోంది.. అన్నం పెట్టండంటూ... కాల్‌సెంటర్‌కు 506 ఫోన్లు - LOCK DOWN UPDATES

ఆకలేస్తోంది... అన్నం పెట్టండి బాబూ.. అంటూ హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన కాల్​సెంటర్​కు ఫోన్లు వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆదివారం మొత్తం వచ్చిన ఫోన్లలో 506 కాల్స్​ కేవలం ఆహారం కోసం చేశారని అధికారులు వెల్లడించారు.

NUMBER OF CALLS FOR FOOD TO HYDERABAD CALL CENTER
ఆకలేస్తోంది.. అన్నం పెట్టండంటూ... కాల్‌సెంటర్‌కు 506 ఫోన్లు
author img

By

Published : Apr 27, 2020, 11:46 PM IST

లాక్‌డౌన్‌ సందర్భంగా పౌరులకు సేవలందించేందుకు హైదరాబాద్​లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కాల్‌సెంటర్‌కు ఆదివారం ఒక్కరోజే 506 ఫోన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాల్స్‌ ఆధారంగా ఆయా ప్రాంతాల్లో సంచార అన్నపూర్ణ కేంద్రాలతో 23,120 ఆహార పొట్లాలు అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

కాల్‌సెంటర్‌కు ఆదివారం మొత్తం 543 ఫోన్లు వచ్చాయన్నారు. వీటిలో కరోనా అనుమానిత కాల్స్‌ 14, అంబులెన్సుల కోసం 3, మిగతా కాల్స్ అన్ని ఆహారం కోసమే‌ అడిగారన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నివాసితుల నుంచి వచ్చిన ఫోన్ల ద్వారా ఇంటికే ఆహారం, నిత్యావసరాలు, మందులు సరఫరా చేశామన్నారు.

ఇదీ చదవండి: కోపంతో నిద్రపోవడం అంత మంచిది కాదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.