నుమాయిష్ కోసం గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నుమాయిష్‌ను వీక్షించేందుకు వచ్చిన సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 15 వరకు బస్సులు నడిపించనున్నట్లు వెల్లడించారు.
సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎగ్జిబిషన్‌కు వచ్చిన సందర్శకుల రద్దీ తగ్గే వరకు నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పనిదినాల్లో 150 బస్సులను, సెలవు రోజుల్లో 200ల బస్సుల వరకు నడపనున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఇక అన్ని రకాల రైల్వే సేవలకు ఒకటే నంబర్