రైల్వే ప్రయాణికులకు ఊరటనిస్తూ శుభవార్త తెలిపింది భారతీయ రైల్వే సంస్థ. ఇకపై రైల్వే ప్రయాణికులు అన్నిరకాల సేవలను ఒకే నంబర్ ద్వారా పొందవచ్చని ప్రకటించింది. ఇప్పటి వరకూ ఉన్న అన్ని హెల్ప్‌లైన్ నంబర్లను 139లో రైల్వే శాఖ విలీనం చేసింది. ఈ నంబర్ ద్వారా ప్రయాణికుల ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని వెల్లడించింది.
ఇదివరకే ఉన్న 182 నంబర్‌ను మాత్రం రైల్వే భద్రత కోసం వినియోగించనున్నట్లు పేర్కొంది. ప్రయాణ సమయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రయాణికులు 139 నంబర్‌కు డయల్ చేసి పరిష్కారం పొందవచ్చని తెలిపింది. 12 భాషల్లో ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవచ్చని వివరించింది.
ఇదీ చూడండి : టిక్‌టాక్ పిచ్చిలో పడి ప్రాణాలతో చెలగాటం