తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన మహా మనిషి నందమూరి తారక రామరావు అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ 24వ వర్ధంతి సభలో రమణాచారితో పాటు అలనాటి నటి జమున, ప్రముఖ హస్యనటులు బ్రహ్మానందం, ఎన్టీఆర్ విజ్ఞాన ట్రస్ట్ వ్యవస్థాపకురాలు లక్ష్మీపార్వతీ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతిని పురస్కరించుకుని పద్మశ్రీ పురస్కార గ్రహీత బ్రహ్మానందాన్ని ఎన్టీఆర్ లలిత కళా పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు.. నేటి ముఖ్యమంత్రులు కొనసాగిస్తున్నారని రమణాచారి పేర్కొన్నారు. నటుడిగా ఎంత గొప్పవాడో.. రాజకీయ నాయకుడిగానూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అందరినీ మెప్పించి నేషనల్ ఫ్రంట్ లీడర్‌గా పేరు సాధించారని కొనియాడారు. ఎన్టీఆర్ లలిత కళా పురస్కరాన్ని బ్రహ్మానందానికి ప్రకటించి.. ఘనంగా సత్కరించినందుకు ట్రస్ట్ నిర్వాహకులను రమణాచారి అభినందించారు.
ఇవీ చూడండి: క్రియాశీల నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్‌కు తొలిస్థానం