NSUI has complained to the DGP: ప్రభుత్వం ఏడు లక్షల మంది నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మండిపడ్డారు. రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్యూట్మెంట్ బోర్డు నిర్వహించే ఎస్సై, కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించిన ఆయన.. ఈమేరకు డీజీపీకి ఫిర్యాదు చేశారు. కటాఫ్ మార్కులలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తప్పుడు ప్రశ్నలతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నపత్రంలో తప్పుగా ఇచ్చిన 22 ప్రశ్నలకు.. 22 మార్కులు ఇవ్వాలని ఆయన కోరారు. క్వాలీఫై మార్కులు వచ్చినప్పటికీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను లిస్ట్‌లో పెట్టలేదని ఆరోపించారు. బోర్డు తక్షణమే ప్రతి అభ్యర్థి మార్క్ లిస్ట్ రిలీజ్ చేయాలని ఆయన కోరారు.
ఇవీ చదవండి: