ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై హీరా గ్రూప్ సీఈవో నౌహీరా షేక్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఒక ఆడబిడ్డ వ్యాపారంలో ఎదగడాన్ని ఒవైసీ జీర్ణించుకోలేకపోతున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఒవైసీ గ్రూప్ సభ్యులు తనను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టారని విమర్శించారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు అంశాలపై నౌహీరా షేక్ మాట్లాడారు.
ముస్లిం మహిళల కోసం 1988 నుంచి హీరా గ్రూప్‌ను ఏర్పాటు చేసి... మహిళల్లో చైతన్యం నింపామని ఆమె పేర్కొన్నారు. 1988 నుంచి 2008 వరకు తమ కంపెనీపై ఎలాంటి ఫిర్యాదులు లేవని... కొంతమంది కావాలనే తప్పుడు ఆరోపణలు చేసి అరెస్టు చేయించారని ఆరోపించారు. తమ కంపెనీ సభ్యులకు తానెప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉందని అన్నారు. షేక్‌పేట్‌లో తన భూమి కబ్జా చేయాలని కొంత మంది చూశారని... ఈ వ్యవహారంలో తనకు బెదిరింపులు వచ్చాయని వాపోయారు.
ఇదీ చదవండి: యువకుడి నగ్న వీడియోలతో రూ. 2 లక్షలు వసూలు