అపోలో క్యాన్సర్ కేంద్రాల అంతర్జాతీయ సంచాలకుడిగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆసంస్థ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. అమెరికాలో ప్రొఫెసర్, ప్రముఖ క్యాన్సర్ వైద్యునిగా పేరొందిన నోరి.. స్వదేశంలోను సేవలందించడానికి సిద్ధమయ్యారు. రెండు నెలలకోసారి భారత్కు వచ్చి రెండు వారాలపాటు దేశంలోని అపోలో క్యాన్సర్ కేంద్రాల్లో వైద్య సేవలు అందించనున్నట్లు నోరి తెలిపారు. వ్యాధికి సరైన సమయంలో చికిత్స అందిస్తే నివారించవచ్చన్నారు. దేశ ప్రజలకు సేవలు అందించేందుకు అపోలోలో చేరినట్లు చెప్పారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా మహిళల్లో బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి: ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యుల నిరసన- అరెస్టు