ETV Bharat / state

మొదలైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్​ ప్రక్రియ

దాదాపు మూణ్నెళ్ల తర్వాత వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తుండగా కార్డు విధానంలో నిర్వహిస్తున్నారు. తొలిరోజు 77 వ్యవసాయేతర ఆస్తులు, భూములు రిజిస్ట్రేషన్‌ అయ్యినట్లు ఆశాఖ వెల్లడించింది.

మొదలైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్​ ప్రక్రియ
మొదలైన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్​ ప్రక్రియ
author img

By

Published : Dec 14, 2020, 10:22 PM IST

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో... రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కాని ... మొదటి రోజు 46 సబ్​రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో మాత్రమే 106 స్లాట్లు బుక్‌ అయ్యాయి. వాటిలో 77 రిజిస్ట్రేషన్లు పూర్తికాగా... 29పెండింగ్​లో ఉన్నాయి. కొందరు తమకిచ్చిన తేదీలను రీషెడ్యూల్‌ చేసుకోగా... మరికొందరు ఇరు పార్టీలు హాజరు కాకపోవడం, ఆధార్‌ కార్డుల్లో ఇబ్బందుల వల్ల పెండింగ్​లో పడ్డాయి. రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తయిన మేరకు మ్యూటేషన్‌ పూర్తి చేసి ఈ పాస్‌పుస్తకాలు ఇచ్చినట్లు అదికారులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా పరిధిలో 29 స్లాట్‌లు బుకింగ్‌ కాగా....21 మాత్రమే రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 12 స్లాట్లు బుకింగ్‌ కాగా అందులో 10 మాత్రమే రిజిస్ట్రేషన్‌ అయ్యినట్లు అధికారులు వివరించారు.

ఇదీ చూడండి: ప్రయాణికులకు శుభవార్త: పండుగ వేళ.. ప్రత్యేక రైళ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.