పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే..
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్‌తో పాటు ఈసీ నిర్ధారిత నమునాలో అఫిడవిట్‌ను పొందుపర్చాల్సి ఉంటుంది. అందులో అభ్యర్థి వివరాలను పూర్తిగా పేర్కొనాలి. విద్యార్హతలు, సామాజిక మాధ్యమాల ఖాతాలతో పాటు నేర చరిత్ర, కేసుల వివరాలను పొందుపర్చాలి. అభ్యర్థులు వారి కుటుంబసభ్యుల ఆస్తుల, అప్పుల వివరాలను తెలియజేయాలి.
విదేశాల్లో ఉన్న ఆస్తులు కూడా...
అఫిడవిట్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఈ మారు కొత్త అంశాన్ని కూడా చేర్చింది. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులకు విదేశాల్లో ఏవైనా ఆస్తులు ఉంటే వాటిని కూడా ప్రమాణపత్రంలో పొందుపర్చాలని స్పష్టం చేసింది. అఫిడవిట్లో పేర్కొన్న నేరచరిత్ర, కేసుల వివరాలను అభ్యర్థులు మూడు మార్లు పత్రికలు, టీవీల్లో ప్రకటించాల్సి ఉంటుంది. అందుకు అయ్యే వ్యయాన్ని కూడా అభ్యర్థుల ఎన్నికల ఖర్చుగానే పరిగణిస్తారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేసింది ఈసీ.
ఇవీ చూడండి: అవసరమైతే జాతీయపార్టీ పెడతా...: కేసీఆర్