ETV Bharat / state

ఓ వైపు నామినేషన్ ప్రక్రియ జోరు మరోవైపు పార్టీల ప్రచార హోరు - Increased nominations for legislative elections

Nomination Process in Telangana Elections 2023 : శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో జోరు పెరిగింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పలు పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. అగ్రనేతలతో ప్రచారం చేయిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నాయి. తమకే అధికారం అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా.. మంచిరోజులు, ముహుర్తాలు ఉండటంతో ఇవాళ, ఈనెల9న పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

nominations in Telangana elections 2023
nominations in Telangana elections 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2023, 9:51 AM IST

శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పెరిగిన జోరు

Increased Nominations in Telangana Elections 2023 : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు.. ఎత్తులకు పై ఎత్తులతో కార్యాచరణ అమలు చేస్తున్నాయి. అభ్యర్థులను ప్రకటించిన పార్టీలు.. వివిధ రూపాల్లో ప్రచారాన్ని వేగవంతం చేశాయి. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన అధికార బీఆర్ఎస్‌.. మిగతా పార్టీలతో పోలిస్తే ముందే ఉంది. ఒకటి, రెండు మినహా ముందుగా అభ్యర్థులను ప్రకటించడంతోపాటు.. ప్రచారంలో జోరు కొనసాగిస్తోంది.

BRS Election Campaign in Telangana 2023 : బీఆర్ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఇప్పటికే నియోజకవర్గాల వారీగాసభల్లో పాల్గొంటున్నారు. కేటీఆర్, హరీశ్‌రావు, మంత్రులు, అభ్యర్థులు, నేతలు.. విస్తృతంగా ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మేనిఫెస్టోను ఇప్పటికే ప్రకటించిన భారత్ రాష్ట్ర సమితి.. పదేళ్ల పాలననే ప్రధానంగా ప్రస్తావిస్తూ ముందుకెళ్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు కాంగ్రెస్, బీజేపీ హయాంతో పోలుస్తూ ఓట్లు అడుగుతున్నారు.

పోలింగ్‌ ఎప్పుడొచ్చినా పోరు పతాక స్థాయిలోనే - రంగారెడ్డి జిల్లాలో రాజకీయ వాతావ'రణం' ఎలా ఉందంటే?

Congress Election Campaign in Telangana 2023 : రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినా గత రెండు ఎన్నికల్లో అధికారం దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్‌.. ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ప్రధానంగా కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు.. తెలంగాణ ఇచ్చిన హస్తం పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరుతోంది. కర్ణాటక స్ఫూర్తితో.. అదే తరహా వ్యూహాన్ని రాష్ట్రంలో అమలు చేసి విజయం సాధించాలని శ్రమిస్తోంది.

హస్తం పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే.. ఇప్పటికే పలు సభలకు హాజరయ్యారు. 6 గ్యారంటీలు (Telangana Congress Six Guarantees) ప్రకటించిన కాంగ్రెస్‌.. వాటిని వంద రోజుల్లోనే అమలు చేసి తీరుతామని హామీ ఇస్తోంది. మరో 19 స్థానాలకు అభ్యర్థులతో పాటు మేనిఫెస్టోను ప్రకటించాల్సి ఉంది.

BJP Election Campaign in Telangana 2023 : డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో బీజేపీ ఎన్నికలకు వెళ్తోంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణకు చేసిన పనులు వివరిస్తూనే.. కేంద్రంలో, రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండడం ద్వారా.. మరింత మెరుగైన అభివృద్ధి, సంక్షేమాన్ని సాధించవచ్చని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, ఇతర నేతలు ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించారు.

హైదరాబాద్‌పై ఈసారి పట్టు ఎవరిదో? సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన పార్టీలు

పలు సభలకు హాజరైన నేతలు.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే 88 స్థానాలకు అభ్యర్థులను నిలబెట్టిన కమలం పార్టీ.. జనసేనకు కుదిరిన పొత్తుతో భాగంగా 9 స్థానాల్ని ఆపార్టీకి కేటాయించింది. మరో 22 నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను ప్రకటించాల్సి ఉంది. ఇంకా మేనిఫెస్టోని ప్రకటించాల్సి ఉంది.

గుర్తుల గుర్తుంచుకో రామక్క - మా పార్టీని గుర్తుంచుకో రామక్క ప్రధాన పార్టీల నోట రామక్క పాట ఇప్పుడిదే టాప్ ట్రెండింగ్

AIMIM Election Campaign in Telangana 2023 : పాతబస్తీలో పట్టును నిలుపుకోవడంతోపాటు ఇతర ప్రాంతాల్లో బలాన్ని చాటుకోవాలని.. మజ్లిస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 9 నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించిన మజ్లిస్‌.. మరో మూడు స్థానాలను అభ్యర్థులను వెల్లడిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ వెల్లడించారు. మజ్లిస్ లేని చోట్ల బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని ఓవైసీ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.

Political Parties Election Campaign in Telangana : మూడు విడతల్లో 87 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బహుజన సమాజ్‌ పార్టీ.. త్వరలో మిగిలిన స్థానాలకు వెల్లడిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ (RS Praveen Kumar) వెల్లడించారు. ప్రధానంగా కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగడుతున్న ఆ పార్టీ.. క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్రంలో బహుజన రాజ్యం తీసుకురావడమే లక్ష్యమని ప్రకటించింది.

మరోవైపు 17 చోట్ల పోటీ చేస్తామన్న సీపీఎం.. ఇప్పటికే 14 స్థానాలకు అభ్యర్థులను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. మరో మూడు స్థానాల్లో పోటీచేసే వారి పేర్లు వెల్లడించాల్సి ఉంది. పొత్తుల విషయంపై కాంగ్రెస్‌తో సీపీఐ ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు టీడీపీ, వైఎస్‌ఆర్‌టీపీ ప్రకటించాయి.

Nominations in Telangana Elections 2023 : ఈనెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో నామినేషన్ల పర్వం మొదలైంది. మొదటి, రెండ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 240 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలుచేశారు. ఆదివారం కావడంతో నామినేషన్లు స్వీకరించలేదు. నేటి నుంచి నామినేషన్ల దాఖలు వేగవంతం కానుంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 10వరకే గడువు ఉంది. మంచిరోజులు కావడం, ముహూర్తాలు ఉండడంతో నేడు, ఈనెల9న.. భారీగా నామినేషన్లు వేయవచ్చని అంటున్నారు.

ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల పాటలు

అసంతృప్తులపై పార్టీల బుజ్జగింపు మంత్రం, ప్రచారం కీలకదశకు చేరడంతో ఆపద మొక్కులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.