భాగ్యనగరంలోని షేక్‌పేట కూడలి నుంచి సెవెన్ టూమ్ మార్గంలో డివైడర్ ఏర్పాటు చేసి... హరితహారం కార్యక్రమంలో భాగంగా మెుక్కలు నాటారు. ఇటీవల డ్రైనేజీ నిర్మాణం కోసం మధ్యలో తవ్వడం వల్ల అక్కడ నుంచి పశువులు రోడ్డు డివైడర్ పైకి ఎక్కి మెుక్కలను తినేస్తున్నాయి.
పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న రాష్ట్ర సర్కారు... నాటిన మొక్కల రక్షణ కోసం ట్రీ గార్డ్లు ఏర్పాటు చేయాలని పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు.