ETV Bharat / state

బ్లాక్‌ఫంగస్‌ బాధితుల ఇక్కట్లు.. ఆరోగ్యం విషమిస్తున్నా కటిక నేలపైనే - తెలంగాణ వార్తలు

బ్లాక్ ఫంగస్ కేస్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 వరకు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్టు సమాచారం. కోఠి ఈఎన్​టీ ఆస్పత్రిలో క్రమంగా పడకలు నిండుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బ్లాక్‌ఫంగస్‌ బాధితులు బెడ్​ల కోసం మూడు రోజులగా నుంచి ఆసుపత్రి ప్రాంగణంలోనే వేచి చూస్తున్నారు. ఆరోగ్యం విషమిస్తున్నా.. కటిక నేలపైనే ఎదురు చూస్తున్నారు.

no-beds-for-black-fungus-victims-at-ent-hospital-in-koti
బ్లాక్‌ఫంగస్‌ బాధితుల ఇక్కట్లు.. జబ్బు తగ్గక ఇబ్బందులు
author img

By

Published : May 21, 2021, 7:01 AM IST

బ్లాక్‌ ఫంగస్‌ (మ్యుకర్‌ మైకోసిస్‌) రోగుల బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచీ హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రికి వస్తున్నా పడకలు దొరకడం లేదు. తమ వంతు కోసం ఆసుపత్రి ఆవరణలో పడిగాపులు కాయాల్సివస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రిని బ్లాక్‌ ఫంగస్‌కు నోడల్‌ కేంద్రంగా ప్రకటించింది. ప్రస్తుతం 90 పడకల వరకు నిండడంతో మరో 50 పెంచేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలవారనే వివక్ష లేకుండా అందర్నీ చేర్చుకోవాలని రోగుల బంధువులు విజ్ఞప్తి చేస్తుండగా, పడకలు లేకపోవడం వల్లే కొందరికి కేటాయించలేకపోతున్నామని వైద్యులు చెబుతున్నారు. అవసరమైతే 200 వరకు పెంచుతామని అంటున్నారు.

ఏపీలోని విజయవాడకు చెందిన నాగరాజు చికిత్స కోసం భార్యతో కలిసి ఈఎన్‌టీ ఆసుపత్రికి వచ్చాడు. ఆక్సిజన్‌ స్థాయి తక్కువ ఉందని, ఇక్కడ ఆ సదుపాయం లేదని చేర్చుకోలేదు. మూడు రోజుల నుంచి ఇక్కడే గడుపుతున్నామని ఆయన భార్య వాపోయారు. గాంధీ ఆసుపత్రికి వెళ్దామంటే కరోనా నెగెటివ్‌ ఉండటంతో అక్కడా చేర్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన మరికొందరు బాధితులు కూడా ఆసుపత్రిలో చేర్చుకోకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. కేటాయించిన పడకలు నిండిపోయాయని వైద్యులు చెబుతుండగా, తమకంటే వెనుక వచ్చిన వారిని చేర్చుకున్నారని కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైన వైద్య సేవలు దొరుకుతాయని ఇక్కడకు వస్తే.. ఇక్కడా చేర్చుకోవడం లేదని, తాము ఇంక ఎక్కడకు పోవాలని కన్నీరుమున్నీరవుతున్నారు.

పరీక్షలకు ఉస్మానియాకు..

ఈఎన్‌టీ వైద్యశాలలో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం సీటీస్కాన్‌ పనిచేయడం లేదు. ఫంగస్‌ ముఖ భాగంలో ఎక్కడెక్కడ వ్యాపించిందనేది గుర్తించడం కష్టమే. ఫంగస్‌ మెదడులోకి విస్తరించిందో లేదో తెలుసుకోవాలంటే బ్రెయిన్‌ ఎం.ఆర్‌.ఐ., మరికొన్ని ఇతర పరీక్షలు అవసరమవుతాయి. ఇవేమీ ఈఎన్‌టీ ఆసుపత్రిలో అందుబాటులో లేకపోవడంతో రోగులను ఉస్మానియా ఆసుపత్రికి పంపుతున్నారు. అక్కడ తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది.

చికిత్స ఈఎన్​టీలో.. పరీక్షలు ఉస్మానియాలో

పాజిటివ్‌ ఉంటేనే గాంధీలోకి..

గాంధీ ఆసుపత్రిలో బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు ప్రత్యేక వార్డు కేటాయించారు. కేవలం కరోనా పాజిటివ్‌తోపాటు బ్లాక్‌ఫంగస్‌ ఉంటేనే చేర్చుకుంటున్నామని వైద్యులు తెలిపారు. ఇక్కడ చికిత్స పొందుతున్న బ్లాక్‌ ఫంగస్‌ రోగుల సంఖ్య గురువారానికి 23కు చేరింది. ఆసుపత్రి ప్రధాన భవనంలోని నాలుగో అంతస్తులో 30 పడకలతో ప్రత్యేకంగా ఓ వార్డు ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.రాజారావు తెలిపారు. ప్రస్తుతం వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. బాధితుల సంఖ్య పెరిగితే మరిన్ని పడకలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

పెరుగుతున్న బాధితుల తాకిడి..

నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బ్లాక్‌ఫంగస్‌ బాధితుల తాకిడి పెరుగుతోంది. కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో గురువారం ఒక్కరోజే 39 మంది చేరారు. ఇప్పటికే ఇక్కడ 90 మంది వరకు చేరారు. ఏడుగురికి శస్త్ర చికిత్స చేసినట్లు వైద్యులు తెలిపారు. గాంధీలో ఇదే వ్యాధితో 23 మంది చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో కోఠి ఈఎన్‌టీలో పడకలకు కొరత ఏర్పడుతోంది.

బ్లాక్‌ ఫంగస్‌తో ఉపాధ్యాయుడి మృతి

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు కేవీఎస్‌ రంగారావు (43) గురువారం మృతి చెందారు. కరోనా నుంచి కోలుకున్న ఆయన అనారోగ్యం బారిన పడటంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయనకు బ్లాక్‌ ఫంగస్‌ ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా దారిలో చనిపోయారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 3,660 కరోనా కేసులు.. 23 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.