ETV Bharat / state

ఏపీపై నివర్ ఎఫెక్ట్... నీట మునిగిన వేల ఎకరాలు - ఏపీ వార్తలు

రైతుల రెక్కల కష్టాన్ని నివర్‌ తుపాను నీళ్లపాలు జేసింది. ఆంధ్రప్రదేశ్​లోని రాయలసీమతోపాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అన్నదాతలను ఆశల సాగును నిండాముంచింది. వేల ఎకరాల్లో చేతికందొచ్చిన పంట నీటిలో నానుతుంది. ప్రధానంగా వరి పంటకు భారీ నష్టం వాటిల్లగా పత్తి, మిరప, వేరుశనగ పైర్లూ పెద్ద మొత్తంలో దెబ్బతిన్నాయి.

nivar-cyclone-heavily-effected-ap-farmers
ఏపీపై నివర్ ఎఫెక్ట్... నీట మునిగిన వేల ఎకరాలు
author img

By

Published : Nov 28, 2020, 6:59 AM IST

నివర్‌ తుపాను పుదిచ్చేరి సమీపంలో తీరం దాటినా... ఆంధ్రప్రదేశ్​లో అంచనాలకు మించి తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా రైతులను నట్టేట ముంచింది. గుంటూరు జిల్లాలో 34 మండలాల పరిధిలో 3 లక్షల ఎకరాలకు పైగా వరి పైరు దెబ్బతింది. వర్షానికి పొలాల్లో నీరు నిలబడింది. పంట సగం కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ఎకరాకు 20వేల రూపాయల మేర పెట్టుబడులు పెట్టామని... కనీసం పదోవంతైనా చేతికిరాదని నిరాశలో కూరుకుపోయారు. గుంటూరు జిల్లాలో 3 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయి. మినప, పెసర, పంటలూ వందల ఎకరాల్లోదెబ్బతిన్నాయి. మంగళగిరి మండలంలో నీటమునిగిన పంటలను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. కృష్ణా జిల్లా నందిగామ మార్కెట్‌యార్డ్‌కు పత్తి విక్రయించేందుకు తీసుకొచ్చిన రైతుల పరిస్థితి.. అగమ్యగోచరంగా తయారైంది. రెండు రోజులుగా వానకు తడిసి పోతుండటంతో … రైతులు యార్డులోనే పడిగాపులు పడాల్సివస్తుంది.

ఆగిన రైతు గుండె

వర్షాలకు ప్రకాశం జిల్లాలోనూ పంట వర్షార్పణమైంది. సుమారు లక్ష హెక్టార్లలో ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. 11 తీర మండలాల పరిధిలో అధికంగా దెబ్బతిన్నాయి. అరటి,బొప్పాయి వంటి ఉద్యాన తోటలు నేలకొరిగాయి. కంది, మినుము, పొగాకు పంటలు నీటిలో నానుతున్నాయి. కనిగిరి నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. ఇంకొల్లు మండలం భీమవరంలో పెద్ద యోగయ్య అనే రైతు మృతిచెందాడు. నీటమునిగిన మిర్చి పంటను చూసి గుండెపోటుకు గురయ్యాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

వంద కోట్ల నష్టం

తుపానుతో కర్నూలు జిల్లాలో 15 వేల788 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, 479 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీటమునిగాయని కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. 34 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. రైతులకు దాదాపు వందకోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. కోతకొచ్చిన వరి నీళ్లలో నానుతోంది. మొక్కజొన్న, ఆలస్యంగా వేసిన వేరుశనగ చేతికిరాకుండా పోయాయి.

వేల హెక్టార్లలో నీట మునిగిన పంట

కడప జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకు పంటలు పూర్తిగా నీటమునిగాయి. మాండవ్య, బాహుదా, పింఛe, చెయ్యేరు, పెన్నా, కుందు, పాపాగ్ని నదులు ఉప్పొంగాయి సుమారు 30వేల హెక్టార్లలో వరి పంట సాగు చేస్తుండగా వేలాది ఎకరాల్లో నీట మునిగింది. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజవర్గాల్లో అరటి, బొప్పాయి, మామిడి, కూరగాయల తోటలకు అధిక నష్టం జరిగింది.

ఇదీ చదవండి : తమిళనాడు, పుదుచ్చేరిలో రానున్న మరో తుపాను

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.