ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తెలంగాణ 9 శాతానికి మించిన వృద్ధి రేటు సాధిస్తోందని నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ ప్రశంసించారు. రాష్ట్రంలో మెరుగైన పారిశ్రామిక విధానాలు, భౌగోళిక పరిస్థితుల వల్లే అది సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశంలోనే తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని రాజీవ్ కుమార్ అన్నారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధిని గుర్తించి కితాబిచ్చిన నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.
ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కృతజ్ఞతలు
రాష్ట్ర అభివృద్ధిని గుర్తించినందుకు నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్కు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ 9 శాతానికి పైగా వృద్ధిరేటు సాధించడం మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
-
Many thanks Rajiv Ji to you & Niti Ayog endorsing the growth of Telangana 🙏 https://t.co/ZA6FmUz8yX
— KTR (@KTRTRS) September 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Many thanks Rajiv Ji to you & Niti Ayog endorsing the growth of Telangana 🙏 https://t.co/ZA6FmUz8yX
— KTR (@KTRTRS) September 12, 2021Many thanks Rajiv Ji to you & Niti Ayog endorsing the growth of Telangana 🙏 https://t.co/ZA6FmUz8yX
— KTR (@KTRTRS) September 12, 2021
ఇదీ చూడండి: KTR: ఒకే చోట 15,660 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. అద్భుత దృశ్యం: కేటీఆర్ ట్వీట్