బెంగుళూరు లాల్భాగ్లో ఉద్యాన శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. అయనతోపాటు కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వవిద్యాలయ వీసీ నీరజా ప్రభాకర్, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యాన వన సాగుకు అనువైన నేలలు ఎక్కువగా తెలంగాణ, కర్ణాటకలోనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఉద్యానపంటల సాగు పెరగాలని అందుకు ఆధునిక పద్ధతులు వాడాలని మంత్రి సూచించారు.
కర్ణాటక ఉద్యానసాగులో ముందుందని దీనిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో ఉద్యానసాగులో ముందుకెళ్తామని ఆయన తెలిపారు. మూస పద్ధతుల నుంచి రైతులను ఆధునిక సాగు వైపు మళ్లించి ఆదాయం పెంపొందిస్తామన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను మళ్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్న మంత్రి.. ఆ బాధ్యతలో భాగంగానే కర్ణాటక పర్యటనకు రావడం జరిగిందన్నారు.
ఇదీ చదవండి: మృతుల కుటుంబాలకు ఆరు లక్షల చొప్పున పరిహారం