ETV Bharat / state

Niranjan Reddy Fires on Opposition Parties : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాలవి దుష్ప్రచారం : నిరంజన్‌రెడ్డి - నిరంజన్​రెడ్డి కామెంట్స్

Niranjan Reddy Fires on Opposition Parties : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాలవి దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్ట్​ను అడ్డుకునేందుకు వారంతా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. తక్కువ ముంపుతో.. ఎక్కువ ప్రయోజనం కలిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్​ దృష్టి పెట్టారని తెలిపారు.

Niranjan Reddy Reaction on Palamuru Projects Comments
Niranjan Reddy Comments on Congress Leaders
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 23, 2023, 5:21 PM IST

Niranjan Reddy Fires on Opposition Parties : పాలమూరుకు నీళ్లొస్తే తమ రాజకీయ జీవితాలు శాశ్వతంగా ఎక్కడ కూలిపోతాయోనని విపక్షాలు విషప్రచారం చేస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Singireddy Niranjan Reddy) అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాలు విషప్రచారం చేస్తున్నాయంటూ మంత్రి ఘాటుగా స్పందించారు.

Niranjan Reddy on Congress Leaders Comments : ఎటువంటి నీటి లభ్యతలేని 6 టీఎంసీల జూరాల ప్రాజెక్టు కింద ఆయకట్టు సహా బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆయకట్టుతో పాటు తాగు నీటి అవసరాలతో కలిపి 5.50 లక్షల ఎకరాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ఇది గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 216 టీఎంసీల సామర్ధ్యం ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంకు నీటిని తోడుకోవడానికి నిర్ణయించుకున్నామని చెప్పారు. విపక్షాలు ముందు జూరాల నుంచి మొదలుపెట్టాలని వాదించారు.. తర్వాత అటవీ ప్రాంతమని ఫిర్యాదులు చేశారని ఆక్షేపించారు. ఆ తర్వాత పర్యావరణం దెబ్బతింటుందని గ్రీన్ ట్రిబ్యునన్‌లో ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు.

Niranjan Reddy Reaction on Palamuru Project : రైతుల పేరిట వివిధ రూపాల్లో కేసులు వేయించారని విమర్శించారు. అన్ని రకాల విఘ్నాలు దాటుకుని పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru- Rangareddy Project)లో మొదటి పంపు ప్రారంభించగానే ఇప్పుడు ఒక పంపుతో ఎలా మొదలు పెడతారని కొత్త రాగం ఎత్తుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జూరాల ప్రాజెక్టు పరిధిలో ప్రతిపాదించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 32 గ్రామాలు, 85 వేల ఎకరాల సేకరణ ఉందని, రీ డిజైన్ చేసిన ఈ ఎత్తిపోతల పథకంలో కేవలం 27 వేల ఎకరాల భూసేకరణ, 3 పెద్ద గ్రామాలు, 8 చిన్న తండాలు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. తక్కువ ముంపుతో ఎక్కువ ప్రయోజనంపై సీఎం కేసీఅర్ దృష్టి పెట్టారన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వ పనులు ఆగవు.. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు అని హితవు పలికారు.

Niranjan Reddy on Palamuru Rangareddy Project : పాలమూరుకు తీరనున్న కష్టాలు.. త్వరలోనే సాగునీళ్లు

Niranjan Reddy Reaction on Congress Leaders Comments : ప్రాజెక్టు నిర్మాణంలో ఏమైనా అవరోధాలు, లోపాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. తెలంగాణ ఎత్తిపోతల పథకాలు అన్నీ ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి నేతృత్వంలో పనులు నడుస్తున్న దృష్ట్యా ఇప్పటి వరకు దాదాపు 250 పైగా మోటార్లు బిగించామని తెలిపారు. రాష్ట్రం గర్వించదగిన ఇంజినీరు పెంటారెడ్డిపై కూడా వీరు బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. క

ల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక్క పంపునే ప్రారంభించారన్న ప్రాథమిక విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. మిగతా పంపులన్నీ తెలంగాణ ఏర్పాటైన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోనే పూర్తి చేసుకున్నామని తెలిపారు. 60 ఏళ్లలో నష్టపోయిన పాలమూరు జిల్లా నాయకత్వంలో నిలదొక్కుకుంటుందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

Niranjan Reddy on Palamuru Rangareddy Project : 'ఈ శతాబ్దపు అతి పెద్ద విజయం.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు'

Niranjan Reddy Farm Progress Show 2023 : 'ఫార్మ్​ ప్రోగ్రెస్​ షో'కు మంత్రి నిరంజన్​ రెడ్డికి ఆహ్వానం

Niranjan Reddy on Telangana Crop Loss : 'త్వరలోనే రాష్ట్రంలో.. ప్రత్యేక పంట బీమా పథకం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.