ETV Bharat / state

DARBHANGA BLAST: భాగ్యనగర కేంద్రంగా ‘ఉగ్ర’ దర్యాప్తు! - హైదరాబాద్​లో లష్కరేతోయిబా ఉగ్రవాదులు ఉన్నారా..?

దర్భంగా రైల్వేస్టేషన్​లో పేలుడు వెనక ఉగ్రవాదుల హస్తం ఉందన్న ఆధారాలు దొరకడంతో... ఐఎన్​ఏ హైదరాబాద్ కేంద్రంగా ఉగ్ర దర్యాప్తును ప్రారంభించింది. అందులో భాగంగానే జాతీయ దర్యాప్తు సంస్థ ఉన్నతాధికారులు నగరానికి చేరుకున్నారు. మాలిక్ సోదరుల కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

nia-officers-started-investigation-in-hyderabad-as-part-of-the-blast-case-at-darbhanga-railway-station
భాగ్యనగర కేంద్రంగా ‘ఉగ్ర’ దర్యాప్తు!
author img

By

Published : Jul 4, 2021, 8:53 AM IST

దర్భంగా రైల్వేస్టేషన్‌లో పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందన్న రుజువులు లభించడంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఎ.) ఉగ్రకోణం మూలాలను అన్వేషించేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకూ హైదరాబాద్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీలో సోదాలు, దర్యాప్తు నిర్వహించిన ఎన్‌.ఐ.ఎ. అధికారులు ఇకపై హైదరాబాద్‌ కేంద్రంగా పరిశోధన సాగించనున్నారని తెలిసింది. దీన్ని స్వయంగా పర్యవేక్షించేందుకు ఎన్‌.ఐ.ఎ. ఉన్నతాధికారులు హైదరాబాద్‌ చేరుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఆదివారం కీలక అధికారి రానున్నారు. ఇక్కడి నుంచి వారు మాలిక్‌ సోదరుల కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు.

ఐఎస్‌ఐ లింకులపై ఆరా..

దర్భంగా ఎక్స్ ప్రెస్​లో పేలుడు పదార్థాలను పంపించి రైలు కదులుతుండగానే బోగీలను పేల్చాలన్నది ఉగ్రవాదుల పథకం. ఈ కుట్రలో మల్లేపల్లిలో నివాసముంటున్న నసీర్ ఖాన్, ఇమ్రాన్ మాలిక్​లు కీలక పాత్ర పోషించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దర్భంగాకు ఒక పార్సిల్​ను బుక్ చేసింది వీరిద్దరేనని దర్యాప్తులో తేలింది. హైదరాబాద్​లోని మల్లేపల్లిలో ఇరవైఏళ్ల నుంచి మాలిక్ సోదరులుంటున్నారు. వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న వీరికి స్నేహితులు, సన్నిహితులు ఎవరైనా ఉన్నారా?, కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారా, యూపీలో ఉన్నారని వంటి అంశాలపై ఆరా తీయనున్నారు. అలాగే మాలిక్ సోదరుల పాస్ పోర్టుల ఆధారంగా ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారనేది కుడూ తెలుసుకోనున్నారు. విదేశాలకు వెళ్లేందుకు తప్పుడు వివరాలతో పాస్ పోర్టులు పొందారా... అన్న కోణంలోనూ లోతుగా విచారిస్తున్నారు. బాంబు పేలుళ్లకు ఉపయోగించిన రసాయనాలను రైల్లో పంపించేందుకు వీలుగా మాలిక్ సోదరులు ఒక నకిలీ పాన్ కార్డును ఉపయోగించారు. నకిలీ పాన్ కార్డును ఉపయోగించారంటే... పక్కా ప్రణాళికతోనే పేలుళ్లకు పాల్పడి ఉంటారని ఎన్.ఐ.ఎ అధికారులు భావిస్తున్నారు.

లష్కరేతోయిబా ఉగ్రవాదులతో సంప్రదింపులు

మాలిక్‌ సోదరులకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని శామ్లిజిల్లాకు కైరానాకు చెందిన ఇద్దరు లష్కరేతోయిబా ఉగ్రవాదులు మహ్మద్‌ సలీమ్‌, కాఫిల్‌లు సహకరించారు. వారితో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడి పేలుడు పదార్థాలను ఎలా, ఎక్కడికి పంపించాలో ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో మహ్మద్‌ సలీమ్‌.. పాకిస్థాన్‌లో లష్కరేతోయిబా ఉగ్రవాద సంస్థ సభ్యుడైన ఇక్బాల్‌తో తరచూ సంప్రదింపులు జరుపుతూ ఇక్కడికి హవాలా రూపంలో డబ్బు తీసుకువచ్చేవాడని గుర్తించారు. ఎన్‌ఐఏ అధికారులు హైదరాబాద్‌ కేంద్రంగా... దర్భంగా పేలుడు కేసు దర్యాప్తు ముమ్మరం చేయనుండడంతో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి: DARBHANGA BLAST: దర్భంగా పేలుళ్ల కేసులో మరో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.