ఏపీ విశాఖ పరవాడ ఫార్మాసిటీలోని సాయినార్ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజీ ఘటనపై నేడు దిల్లీ ఎన్‌జీటీలో విచారణ జరుగనుంది. వార్తా కథనాల ఆధారంగా సుమోటోగా కేసు తీసుకున్న జాతీయ హరిత ట్రైబ్యునల్ ఈ ఘటనపై విచారణ చేయనుంది.
ఇప్పటికే ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్‌జీటీ దానిపై విచారణకు ఆదేశించింది. విశాఖలో మరో గ్యాస్ లీకేజీ ఘటన అంటూ ప్రచురితమైన కథనాల ఆధారంగా కేసు నమోదు చేసింది.
ఇదీ చూడండి: గుడ్న్యూస్: ఐటీ సంస్థల అవకాశం... అభ్యర్థుల్లో ఆనందోత్సాహం