NGT On New Secretariat: తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణంపై ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయనందుకు కేంద్ర పర్యావరణశాఖపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండేళ్లైనా కౌంటర్ దాఖలు చేయనందుకు రూ.10 వేలు జరిమానా విధించింది. వచ్చే నెల 15లోపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి ఎన్జీటీ ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయకపోతే అధికారుల నుంచి జరిమానా వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
పర్యావరణ శాఖ తీరు సరిగా లేదన్న ఎన్జీటీ చెన్నై బెంచ్... ఆ శాఖ సంయుక్త కార్యదర్శి హాజరుకు ఆదేశిస్తామని తెలిపింది. పర్యావరణ అనుమతులు లేకుండా సచివాలయం కూల్చారని ఎన్జీటీలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ చెన్నై బెంచ్... విచారణ సందర్భంగా కేంద్ర పర్యావరణశాఖ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. పర్యావరణశాఖ రాష్ట్ర హైకోర్టును తప్పుదోవ పట్టించిందని రేవంత్ న్యాయవాది పేర్కొన్నారు. హైకోర్టుకు పర్యావరణశాఖ తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆయన వాదించారు. విచారణను మార్చి 15కు ఎన్జీటీ చెన్నై బెంచ్ వాయిదా వేసింది.
ఇదీ చూడండి: సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో విచారణ