కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో... తమవంతు సాయం అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయి. వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రి సహాయనిధికి 3 కోట్ల రూపాయల భారీ విరాళం అందజేశారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ చెక్కును రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు అందించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను కేటీఆర్ అభినందించారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేసిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
- జేఎస్ గుప్తా 1 కోటి రూపాయలు
- థ్రిల్ సిటీ నిర్వాహకులు తలసాని సాయి కిరణ్ యాదవ్ 25 లక్షల రూపాయలు
- జలవిహార్ నిర్వాహకులు రామరాజు 15 లక్షల రూపాయలు
- గుజరాతి స్కూల్ నిర్వాహకులు ఘన శ్యాం పటేల్ 11 లక్షల రూపాయలు
- మహేశ్వరి భవన్ ట్రస్ట్ నిర్వాహకులు సురేష్ కనకాని 11 లక్షల రూపాయలు
- వంశీ రామ్ 10 లక్షల రూపాయలు
- జేమ్స్ అవెన్యూ నిర్వాహకులు పరమేష్ 10 లక్షల రూపాయలు
- శాంత శ్రీరామ్ నర్సయ్య 10 లక్షల రూపాయలు
- అభిరుచి స్వీట్స్ నిర్వాహకులు కోషోర్ 10 లక్షల రూపాయలు
- సాయిబాబా అండ్ కంపెనీ 10 లక్షల రూపాయలు
- ఆంధ్ర కెమికల్స్, లక్ష్మి దాస్ షా 07 లక్షల రూపాయలు
- రాజ్ తాడ్ల 05 లక్షల రూపాయలు
- చింతల రవీందర్, శుభం గార్డెన్స్ 05 లక్షల రూపాయలు
- గుజరాతి స్కూల్ ఆశిక్ కేడియ, గిరీష్ రంగ్ తేరా 05 లక్షల రూపాయలు
- గోపాల్ పీజీ రోడ్ 05 లక్షల రూపాయలు
- మానేపల్లి గోపి 05 లక్షల రూపాయలు
- సూర్యనారాయణ గురుప్రీత్ గాల్వనైసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 05 లక్షల రూపాయలు
- కుమరం ఫిలమెట్స్, వీవీ నెట్స్ 04 లక్షల రూపాయలు
- విజయ్ కుమార్, విస్కాన్ ఫార్మా 03 లక్షల రూపాయలు
- ప్రదీప్, ప్రమోద్, ప్రశాంత్ 03 లక్షల రూపాయలు
- వివేక్ ఘంటా 03 లక్షల రూపాయలు
- పవన్ కుమార్ గౌడ్ 01 లక్షల రూపాయలు
- ఎంవీవీ సత్యనారాయణ 01 లక్షల రూపాయలు
- అశోక్ కుమార్, మహాలక్ష్మి, ఎల్‌పీజీ సెంటర్ 01 లక్షల రూపాయలు
ఇదీ చూడండి: వైద్యులకు బయోసూట్... రూపొందించిన డీఆర్డీవో