New Year Drugs Seize in Hyderabad Today 2023 : కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకడానికి భాగ్యనగరం సిద్దమైంది. పలు రెస్టారెంట్లు, పబ్‌లు, బార్లలలో పాటు ప్రత్యేకంగా నూతన సంవత్సర వేడుకలు నిర్విహించేందుకు యజమానులు ఇప్పటికే అనుమతులు తీసుకున్నారు. కాగా వేడుకల్లో మాదక ద్రవ్యాలు ఉపయోగిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేకంగా టీఎస్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎస్‌వోటి, లా అండ్ ఆర్డర్, ఎక్సైజ్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెటారు.
Drugs Seized in Jubilee Hills : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను(నవీన్), (సాయి) పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి సుమారుగా రూ.7.50 లక్షల విలువైన 100గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ (MDMA), 2 గ్రాముల కొకైన్, 29గ్రాముల బ్రౌన్ షుగర్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లోని ఓ ప్రముఖ యూనివర్శిటిలో చదువుతున్న విద్యార్థులు అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాదులో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. గత నాలుగేళ్లుగా నూతన సంవత్సరం కోసం డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలింది. నిందితులు సూరి, లీల నవీన్‌గా గుర్తించారు.
SOT Police Three Drugs Peddlers in LB Nagar : మరోవైపు హైదరాబాద్ ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు డ్రగ్ సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి 15 గ్రాముల హెరాయిన్‌ను (Heroin) స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో విక్రయించేందుకు ఈ ముఠా రాజస్థాన్ నుంచి హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ ముఠా సభ్యులు పలువురికి డ్రగ్స్ విక్రయించినట్లు వారు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత - నైజీరియన్ నుంచి కొని ఇక్కడ అమ్మకాలు
West Zone DCP on Drug Supply in Hyderabad : నూతన సంవత్సర వేడుకలను జాగ్రత్తగా జరుపుకోవాలని వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. పోలీసులు సూచించిన నియమాలను పాటిస్తూ పబ్బులు, క్లబ్ నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన కోరారు. డ్రగ్స్ విక్రయాలు జరిపితే కఠినమైన చర్యలు తీసుకుంటారని ప్రజలను హెచ్చరించారు. డ్రంకన్ డ్రైవ్ (Drunk And Drive) పరీక్షతోపాటు నార్కోటిత్ టెస్టులు కూడా నిర్వహిస్తామని డీసీపీ తెలిపారు.
Ganja Seized in Hyderabad : ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సాయి, వంశీ అనే యువకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల నుంచి 2.6కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు మహేశ్వరం జోన్ ఎస్వోటీ పోలీసులు ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వారాసిగూడ వద్ద 7.5కిలోల గంజాయి సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాయగడ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ పరిధిలోని శివరాంపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఇంట్లో ఎస్వోటీ పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. ఆమె దగ్గర నుంచి 8 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ కోసం బెంగళూరు నుంచి ఇద్దరి యువకులతో డ్రగ్స్ తెప్పించిందని మొత్తం ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
శంషాబాద్ పరిధిలో శనివారం ద్విచ్రవాహనంపై 2.70కిలోల గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లను తరలిస్తుండగా శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయి సహా, మూడు సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.