రవాణాశాఖ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఆన్లైన్ సేవలను మరింత విస్తరిస్తోంది. ఇకపై ప్రతి పని కోసం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన 'టి యాప్ ఫోలియో' ద్వారా పని పూర్తి చేసుకోవచ్చని రవాణాశాఖ సంయుక్త కమిషనర్ రమేష్ పేర్కొన్నారు. లైసెన్స్‌ల పునరుద్ధరణ నుంచి పర్మిట్ల వరకు 20 రకాల సేవలను యాప్‌తో అనుసంధానం చేయనున్నట్లు.. ఈ సేవలను మార్చి 15 నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ సేవలను పొందేందుకు ప్లే స్టోర్ నుంచి 'టి యాప్ ఫోలియో'ను డౌన్ లోడ్ చేసుకొని.. అవసరమైన సేవను ఎంచుకొని, ఆన్ లైన్ ద్వారా రుసుం చెల్లిస్తే సరిపోతుందని కమిషనర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు, ఏయే సేవలు టి యాప్ లో అందుబాటులో ఉన్నాయని కమిషనర్ వివరించారు.
ఇవీ చూడండి: 'వారి గాథలు వినడం కాదు... మనమే చరిత్ర సృష్టించాలి'