ETV Bharat / state

'శంషాబాద్ విమానాశ్రయం​లో ఆధునిక కెమెరాల ఏర్పాటు' - శంషాబాద్ విమానాశ్రయం​ సీఈవో కిశోర్​

శంషాబాద్​ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం హెచ్​వోఐ యాప్​ ప్రవేశపెట్టామని ఎయిర్​పోర్ట్​ సీఈవో కిశోర్​ తెలిపారు. అలాగే విమానాశ్రయంలో ప్రయాణికుల గుర్తింపు పత్రాలు, టికెట్‌ పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎయిర్​పోర్టులో 2, 3 వారాల్లో ఆధునిక కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

'శంషాబాద్ విమానాశ్రయం​లో ఆధునిక కెమెరాల ఏర్పాటు'

author img

By

Published : May 23, 2020, 2:31 PM IST

హైదరాబాద్​ శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికుల గుర్తింపు పత్రాలు, టికెట్‌ పరిశీలిస్తున్నట్లు ఎయిర్​పోర్ట్​​ సీఈవో కిశోర్​ తెలిపారు. ప్రతి ప్రయాణికుడు కెమెరా ముందు ప్రయాణ పత్రాలు ప్రదర్శించాలన్నారు. విమానాశ్రయంలో ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఎయిర్​పోర్ట్​లో 2, 3 వారాల్లో ఆధునిక కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కెమెరాల ద్వారా ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రత, ముఖ గుర్తింపు జరుగుతుందని కిశోర్​ వివరించారు.

"విమాన ప్రయాణికుల కోసం హెచ్‌వోఐ యాప్‌ ప్రవేశపెట్టాం. ఈ యాప్‌ ద్వారా ప్రయాణికులు ఇంటి వద్దే భోజనం ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో విమానంలో భోజనం చేసే సదుపాయం ఉండదు. ఇంటి వద్ద లేదా విమానాశ్రయంలో మాత్రమే భోజనం చేయాలి. వీలైనంత వరకు విమానంలో వాష్‌రూమ్‌ వాడకుండా చూడాలని ఆలోచిస్తున్నాం. విమానాశ్రయాల్లో కొత్త పద్ధతి ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నాం."

-కిశోర్​, శంషాబాద్​ విమానాశ్రయం సీఈవో

'శంషాబాద్ విమానాశ్రయం​లో ఆధునిక కెమెరాల ఏర్పాటు'

ఇదీ చూడండి: భారత 'జ్యోతి'కి ఇవాంకా ట్రంప్​ సలాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.