ETV Bharat / state

నూతన సచివాలయం నిర్మాణం మొదలయ్యేనా...?

author img

By

Published : Jun 4, 2019, 4:34 AM IST

Updated : Jun 4, 2019, 6:55 AM IST

తెలంగాణలోని ఏపీ భవనాలు ప్రభుత్వానికి దక్కాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది ? కొత్త సచివాలయం నిర్మిస్తుందా...? నిర్మిస్తే ఎక్కడ నిర్మించనుంది...? ఇవన్నీ ప్రస్తుతం అందరి మదిని తొలుస్తోన్న ప్రశ్నలు. భవనాల అప్పగింతకు ఏపీ సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో నూతన సచివాలయ నిర్మాణంపై ప్రాథమికంగా చర్చ జరిగింది. అతి త్వరలోనే కొత్త సచివాలయ నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సచివాలయ నిర్మాణం
నూతన సచివాలయ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి

ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్​కు కేటాయించిన ప్రభుత్వ భవనాలు రాష్ట్రానికి దక్కాయి. ఏపీ అంగీకారంతో గవర్నర్ నరసింహన్ ఆ భవనాలను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ భవనాలను తమకు అప్పగించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయనుంది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం తన అవసరాల కోసం పోలీసు శాఖకు ఒకటి, మిగతా శాఖల కోసం మరో భవనం కోరనుంది. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లోనే అధికారికంగా లేఖలు పంపనున్నారు. భవనాల అప్పగింత నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బకాయి ఉన్న విద్యుత్, మంచినీటి, ఆస్తిపన్నులు దాదాపు రూ.14 కోట్లు మేర రద్దు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైదరాబాద్​లోని ప్రభుత్వ భవనాలను రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ విభజన సమయంలో జారీ చేసిన 30 ఉత్తర్వులకు సవరణ చేయాల్సి ఉంటుంది.

సచివాలయం నిర్మాణంపై దృష్టి

ఏపీ భవనాలు దక్కిన నేపథ్యంలో కొత్త సచివాలయ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందన్నది ఇప్పుడు చూడాలి. ప్రస్తుత సచివాలయం పాలనకు అనువుగా లేదని, వాస్తుదోషం ఉందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆరే ప్రకటించారు. ఐదేళ్ల క్రితమే నూతన సచివాలయ భవనాల నిర్మాణానికి మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకుని రూ. 150 కోట్లు కేటాయించారు. వివిధ ప్రదేశాలను పరిశీలించిన ప్రభుత్వం కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న బైసన్​పోలో మైదానంలో సచివాలయం నిర్మించాలనే నిర్ణయానికి వచ్చింది. తదనుగుణంగా సీఎం కేసీఆర్​... ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసి స్వయంగా విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర నుంచి ఇంకా ఏ నిర్ణయమూ వెలువడలేదు.

ప్రస్తుత సచివాలయ స్థానంలోనే...

కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకుంటే ప్రస్తుత సచివాలయ ప్రాంతంలోనే నూతన భవనాలు నిర్మించవచ్చని అంటున్నారు. అదే జరిగితే తెలంగాణ సచివాలయం కార్యకలాపాలు నడుస్తోన్న ఏ, బీ, సీ, డీ బ్లాకులను తొలగించి వాటి స్థానంలో కొత్త భవనాల నిర్మాణం జరుగుతుందని సమాచారం. ఇదే సమయంలో హెచ్​, జే, కే, ఎల్​ బ్లాకుల్లో సచివాలయ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా నూతన సచివాలయ నిర్మాణాన్ని చేపట్టాలన్న ఆలోచనలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి : పరిషత్ అధ్యక్షుల ఎన్నిక సమన్వయానికి తెరాస ఇంఛార్జీలు

sample description
Last Updated : Jun 4, 2019, 6:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.