ETV Bharat / state

వైద్యులకు గుడ్​న్యూస్.. ఇక నుంచి నచ్చిన చోట పోస్టింగ్‌..! - New directions in the appointment of doctors

Civil Assistant Surgeons Recruitment : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గతంలో వైద్యుల నియామకాల్లో ఇష్టానుసారంగా పోస్టింగ్‌లు ఇవ్వడంతో ఎక్కువ మంది వైద్యులు విధుల్లో చేరలేదు. దీని వలన అనేక సమస్యలు వచ్చాయి. అందుకే ఈ దఫా సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకాల్లో నూతన విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించిన ఆ శాఖ.. ఈ సారి వారు కోరుకున్న చోట పోస్టింగ్​ ఇవ్వడానికి సన్నదం అయ్యింది.

dector
dector
author img

By

Published : Nov 28, 2022, 10:44 AM IST

Civil Assistant Surgeons Recruitment: గతంలో వైద్యుల నియామకాల్లో అనుసరించిన విధానాల వల్ల పలు సమస్యలు వచ్చినందున.. ఈ దఫా సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకాల్లో నూతన విధానాన్ని అమలు చేయాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. నాలుగేళ్ల కిందట వైద్య విధానపరిషత్‌ పరిధిలో అభ్యర్థుల ప్రాధాన్యాలను పట్టించుకోకుండా.. ఇష్టానుసారం పోస్టింగ్‌లు ఇవ్వడంతో ఎక్కువ మంది వైద్యులు విధుల్లో చేరలేదు. దీంతో ఈసారి ఎంబీబీఎస్‌ అర్హతతో నియమితులయ్యే వైద్యులకు వారికి నచ్చినచోట పోస్టింగ్‌ ఇవ్వాలని నిర్ణయానికొచ్చినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 751 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 211 జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ పరిధిలో 7 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీ తుది దశకు చేరుకోవడంతో వాటిపై తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 969 పోస్టులకు చెందిన తుది జాబితాను వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ ప్రభుత్వానికి మూణ్నాలుగు రోజుల్లో అందజేయనుంది.

రిజర్వేషన్లు, నియామక నిబంధనలు, అనుభవం, వెయిటేజీ తదితరాలను అనుసరించి బోర్డు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇందులో సుమారు 70 శాతానికి పైగా ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేస్తున్న వైద్యులే ఎంపికైనట్లు తెలుస్తోంది. వీరికి 20 మార్కులను వెయిటేజీగా ఇవ్వడంతో.. నేరుగా దరఖాస్తు చేసుకున్న వారి కంటే ఎక్కువ మార్కులు సాధించి వీరు ముందు వరుసలో నిలిచినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.