ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి మహమూద్ (Mahamud ali) అలీ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం శాంతి భద్రతలను మరింత కట్టుదిట్టం చేయడంలో భాగంగా పోలీసు శాఖకు అదనపు నిధులు కేటాయించినట్లు తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న పోలీస్‌స్టేషన్ (Police Station)లు కార్పొరేట్ కార్యాలయాలను తలపిస్తున్నాయన్నారు.
ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ నూతన భవనాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఎస్‌ఆర్ పోలీస్‌స్టేషన్ పరిధి ఎక్కువగా ఉన్నందున మరో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి తలసాని పేర్కొన్నారు. రహ్మత్‌నగర్‌లో ఇందుకోసం స్థలం కూడా స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎంపిక చేశారని సీఎంతో మాట్లాడి పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.
త్వరలోనే బంజారాహిల్స్‌లో పోలీస్ టవర్స్ (Police Towers)ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. చీమ చిటుక్కుమన్నా... ఈ టవర్స్ ద్వారానే తెలుసుకుని పర్యవేక్షించే వీలుంటుందని మహేందర్‌రెడ్డి వివరించారు.
ఇదీ చూడండి: KTR: పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ లక్ష్యం