పురపాలక పౌరసేవలకు చట్టబద్ధత రానుంది. కొత్తగా రానున్న ఏకీకృత పురపాలక చట్టంలో ఆ శాఖ బాధ్యతలు విధులుగా మారనున్నాయి. పుర, నగర పాలక వ్యవస్థలలో ఇప్పటివరకూ అమలవుతున్న పౌరసేవ పత్రం కొత్త చట్టంలో భాగం కానుంది. ఇక ప్రజలకు మెరుగైన సేవలు లభించనున్నాయి. బాధ్యతతో కూడిన జవాబుదారీ పాలన అందించేందుకు పెద్దపీట వేయాలని సీఎం కేసీఆర్ సూచించడం వల్ల చట్టం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
పౌరసేవలు పొందడం కోసం ఉద్దేశించిన చట్టం అమలైతే ఇక ఉదాసీనతకు అవకాశం ఉండదు. నిర్దేశించిన సమయం లోపల సేవలు పొందడం ప్రజల హక్కుగా మారనుంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు జవాబుదారీగా ఉండనున్నారు.
ఇవీ చూడండి : 'వాస్తు పేరుతో వందల కోట్ల ప్రజాధనం వృథా'