Villagers Saved The Cow That Fell Into The Well : మేత కోసం చేనుకొచ్చిన ఓ ఆవు ప్రమాదవశాత్తు పాత బావిలో పడిపోయి నరకం చూసింది. అందులో నుంచి బయటకు వచ్చేందుకు దాదాపు ఆరు గంటలు ప్రయత్నించింది. బావి ఇరుకుగా ఉండటంతో ఆవు బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఏ మాత్రం వీలు కాలేదు. అయినా వెనక్కి తగ్గలేదు పోరాటాన్ని ఆపలేదు. తన శక్తినంతా కూడగట్టుకుని ప్రతి క్షణం పోరాడింది. ఆ పట్టుసడలని పోరాట పటిమే ఆ మూగజీవి ప్రాణాన్ని నిలిపింది.
చిత్తూరు జిల్లా చౌడేపల్లే మండలం దిగువపల్లె పంచాయతీ అప్పినేపల్లె శివార్లలో ఒకచోట పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అక్కడ గుంతలు. వాటివల్ల అక్కడ గుంతలు, రాళ్లు ఏం ఉన్నా కనిపించడం లేదు. వాటి మధ్యలో ఓ పాత బావి ఉంది. అదే గ్రామంలో ఉంటున్న చంద్రా అనే వ్యక్తికి చెందిన పాడి ఆవు అటువైపు మేతకు వెళ్లింది. మేత మేస్తుండగా, ఒక్కసారిగా దాని వెనుక కాళ్లు నూతిలో జారగా అది కూడా అందులో పడిపోయింది.
మనుషుల కన్నా మూగజీవాల ప్రేమే మిన్న - ఇదే ఉదాహరణ!
ఆరు గంటలు తీవ్రంగా శ్రమించి : దీంతో ఇరుకైన బావిలో పడిన ఆవు ఊపిరాకల కనుగుడ్లు తేలినా, దైన్యంతో అడుగుంటుతున్న ఆశలతో ప్రాణం కోసం పోరాడింది. ప్రతి క్షణం మృత్యువుతో పోరాడుతూ, ఊపిరి ఎగబీలుస్తూ దీనంగా ఎవరైనా కాపాడుతారేమోనని వేచి చూసింది. ఆవు చేస్తున్న శబ్దం విని యజమాని కేకలు వేయడంతో అక్కడే ఉన్న గ్రామ సర్పించి భర్త వెంకట రెడ్డి, గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టారు. పొక్లయిన్‌ను తెప్పించి, బావి చుట్టూ మట్టిని తీస్తూ వెడల్పూ చేస్తూ వచ్చారు. దాదాపు ఆరు గంటలపాటు తీవ్రంగా శ్రమించి ఆవుని కాపాడారు.
ప్రపంచంలోనే అతి చిన్న ఆవు- 'బంగారు' పాలను ఇస్తుందట! చూసేందుకు ప్రజలు క్యూ - WORLD SMALLEST COW
ఇంటి గోడపై పులి- 8 గంటలు డ్రామా! గ్రామస్థులు తరిమినా బెదరకుండా రిలాక్స్