New MLA Candidates in Telangana Assembly Elections 2023 : రాజకీయం అనేది వైకుంఠపాళి. ఓసారి అందనత్త ఎత్తుకు తీసుకెళ్తుంది. మరోసారి అధఃపాతాళానికి నెట్టేస్తుంది. అయినా సరే గెలుపోటములు పట్టించుకోకుండా చాలా మంది రాజకీయాల్లో తమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునేందుకు వస్తుంటారు. అలా మరికొద్ది రోజుల్లో జరగనున్న తెలంగాణ శాసనస సభ ఎన్నికల్లోనూ చాలా మంది తమ రాజకీయ భవిష్యత్ ఏంటో తెలుసుకునేందుకు రెడీ అయ్యారు. అయితే మునుపెన్నడూ లేనంతగా ఈసారి చాలా మంది కొత్త వాళ్లు ఈ ఎన్నికల బరిలో దిగుతున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి 25 మంది, బీజేపీ నుంచి 18 మంది కొత్తవారు అవకాశం దక్కించుకుని ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
First Timers in Telangana Assembly Elections 2023 : ఈ మేరకు అభ్యర్థుల్లో చాలామంది తాము టికెట్లు ఆశిస్తున్న నియోజకవర్గాల్లో ముందే తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీలో గతంలో పోటీ చేసిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో టికెట్టు రాక అసంతృప్తి ఉండగా .. వారి మద్దతు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రత్యర్థులు బలమైన వారు కావడంతో వారిని ఢీ కొట్టడానికి సర్వశక్తులు కూడగట్టుకుంటున్నారు. ఉదాహరణకు.. పాలకుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై పోటీ చేస్తున్న యశస్విని(కాంగ్రెస్) తనను తాను నిరూపించుకోవడానికి నిత్యం ప్రజల్లో తిరుగుతూ శ్రమిస్తున్నారు.
బీజేపీ - జనసేన మధ్య తేలిన సీట్ల లెక్క, తెలంగాణలో 9 స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన
New MLA Candidates list For 2023 Elections : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన సిర్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనప్ప బలమైన అభ్యర్థిగా ఉండగా.. ఆయనను ఢీ కొట్టడానికి ప్రజల్లో తిరుగుతూ గెలుపొందేందుకు సర్వశక్తులు కూడగట్టుకుంటున్నారు. సిర్పూర్‌లోనే ఉండటానికి నూతన గృహ ప్రవేశం కూడా చేశారు. బీఎస్పీ తరపున కేడర్‌ను పెంచుకోవడంతో పాటు వారి ద్వారా ప్రచారం నిర్వహించి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన కృషి చేస్తున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత మొదటిసారి ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. తన తండ్రి చేసిన అభివృద్దిని గమనించి కేసీఆర్ టికెట్టు ఇచ్చారని.. ఈ ఎన్నికల్లో గెలిచి కేసీఆర్‌కు తన గెలుపును గిఫ్ట్ ఇచ్చేందుకు ఆమె తీవ్రంగా కృషిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల కంటోన్మెంట్ నుంచే తొలిసారి బరిలోకి దిగారు. రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన వడ్డి మోహన్‌రెడ్డి బోధన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తొలిసారే తాజా, మాజీ ఎమ్మెల్యేలతో పోటీ పడుతున్నారు.
ప్రచారంలో జోరు పెంచిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై స్పెషల్ ఫోకస్
ఇప్పటికే రాజకీయాల్లో ఉండి ఎన్నికల్లో పోటీ చేసిన వారికి అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. పార్టీల బలంతో పాటు కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పోటీలో ఎదురయ్యే సమస్యలు, ఆటుపోట్లు, లోపాలు, లొసుగులు తెలుస్తాయి. కొత్త అభ్యర్థులకు మాత్రం వీటన్నింటినీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే. వీరిపై పార్టీల అధిష్ఠానాల కరుణ ఉన్నా.. క్షేత్ర స్థాయి శ్రేణుల సహకారం అత్యంత అవసరం. ముఖ్యంగా సర్పంచ్ నుంచి ఎంపీపీ వారి పరిధిలో ఉండే కార్యకర్తల నమ్మకాన్ని పొందుతేనే ప్రజల్లోకి సాఫీగా వెళ్లడానికి సాధ్యమవుతుంది.
అధికార బీఆర్ఎస్ పార్టీలో తొలి అవకాశం వచ్చింది వీరికే..
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ - లాస్య నందిత
- ఖానాపూర్ - భూక్యా జాన్సన్
- కోరుట్ల - డాక్టర్ సంజయ్
- ములుగు - భాగ్యజ్యోతి
కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ ఛాన్స్ వీరిదే..
- రావి శ్రీనివాస్ - (సిర్పూరు)
- అజ్మీరా శ్యామ్‌నాయక్ - (ఆసిఫాబాద్),
- కంది శ్రీనివాస్‌రెడ్డి - (ఆదిలాబాద్)
- వెడ్మ బొజ్జు - (ఖానాపూర్)
- ఎం.సునీల్‌కుమార్ - (బాల్కొండ)
- వొడితల ప్రణవ్ - (హుజూరాబాద్)
- మైనంపల్లి రోహిత్‌రావు - (మెదక్)
- బండి రమేశ్ - (కూకట్‌పల్లి)
- కస్తూరి నరేందర్ - (రాజేంద్రనగర్)
- మెగిలి సునీత - (గోషామహల్)
- చిట్టెం పర్ణిక - (నారాయణపేట)
- అనిరుధ్‌రెడ్డి - (జడ్చర్ల)
- వారిటి శ్రీహరి - (మక్తల్)
- రఘువీర్‌రెడ్డి - (నాగార్జునసాగర్)
- వెన్నెల - (కంటోన్మెంట్)
- మామిడాల యశస్విని - (పాలకుర్తి)
- మురళీ నాయక్ - (మహబూబాబాద్)
- నాయిని రాజేందర్‌రెడ్డి - (వరంగల్ పశ్చిమ)
- కేఆర్ నాగరాజు - (వర్ధన్నపేట)
- పరమేశ్వర్‌రెడ్డి - (ఉప్పల్)
- నీలం మధు - (పటాన్‌చెరు)
- పి.శ్రీనివాస్ - (కరీంనగర్)
- మేఘారెడ్డి - (వనపర్తి)
- డా.మట్టా రాగమయి - (సత్తుపల్లి)
- మాలోత్ రాందాస్ - (వైరా)
బీజేపీ నుంచి తొలిసారి పోటీ చేస్తున్న అభ్యర్థులు వీరే..
- వి.మోహన్‌రెడ్డి - (బోధన్)
- పి.రాకేశ్‌రెడ్డి - (ఆర్మూర్)
- దినేశ్ - నిజామాబాద్ గ్రామీణ)
- భోగ శ్రావణి - (జగిత్యాల)
- కందుల సంధ్యారాణి - (రామగుండం)
- సంగప్ప - (నారాయణఖేడ్)
- రాణి రుద్రమదేవి - (సిరిసిల్ల)
- పూసరాజు - (ముషీరాబాద్)
- మిథున్‌కుమార్ రెడ్డి - (మహబూబ్‌నగర్)
- దశమంతరెడ్డి - (జనగామ)
- కుంజ ధర్మారావు - (భద్రాచలం)
- రామలింగేశ్వరరావు - (సత్తుపల్లి)
- బాలరాజు - (పినపాక)
- రవికుమార్ - (పాలేరు)
- అశ్వత్థామరెడ్డి - (వనపర్తి)
- రామచంద్ర రాజనర్సింహా - (జహీరాబాద్)
- పడాల శ్రీనివాస్ - (ఆలేరు)
- డా.కె.ప్రసాదరావు - (పరకాల) టికెట్లు పొందారు.