New Josh in Congress with Join various candidates : హస్తం పార్టీ తన ప్రధాన ఆరు గ్యారెంటీలతో ప్రచారంలో దూసుకెళ్తోన్న తరుణంలో.. ఇతర పార్టీ అభ్యర్థుల చేరికలతో సరికొత్త జోష్ సంతరించుకుంటోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. బీ-ఫామ్‌ల పంపిణీ సైతం జరుగుతుండటంతో అసంతృప్తులంతా హస్తం గూటికి చేరుతున్నారు. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.. రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
హస్తం గూటికి చేరుతున్న బీఆర్ఎస్ అసంతృప్తులు..: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్, హఫీజ్‌పేట్ డివిజన్‌ల బీఆర్ఎస్ కార్పొరేటర్లు(BRS Corporates) జగదీశ్వర్ గౌడ్, పూజిత దంపతులు హస్తం గూటికి చేరుకున్నారు. షాద్‌నగర్, కొడంగల్, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు కాంగ్రెస్‌లోకి చేరారు. గులాబీ పార్టీ మాజీ శాసనసభ్యుడు చెవులపల్లి ప్రతాప్ రెడ్డిని పార్టీలోకి రేవంత్ ఆహ్వానించగా సానుకూలంగా స్పందించారు.
హైదరాబాద్‌లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. తాజా చేరికలతో పార్టీ మరింత బలపడిందన్న వెంకట్‌రెడ్డి.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు(People Representatives) జనాలకు అభివృద్ధి అందించలేకపోతున్నారని వెల్లడించారు. నల్గొండను దత్తత తీసుకున్న కేసీఆర్.. ఒక్క ఇల్లు కట్టలేదు కానీ రూ.3వేల కోట్లతో సచివాలయం కట్టారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పార్టీ స్థానిక నేతలంతా కాంగ్రెస్‌లోకి తరలివస్తున్నారు. చాలావరకు కారు పార్టీ ఖాళీ అయ్యింది. దేశంలో అనేక అభివృద్ధి బాటలు వేసిన హస్తాన్ని.. తెలంగాణ ప్రజలు ఇప్పుడు గెలిపించుకోబోతున్నారు. మా పార్టీ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టి.. పథకాలకు కొసరు కలిపింది - కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత
Telangana Congress Bus Yatra 2023 : ఈనెల 18 నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర.. కొండగట్టు నుంచి ప్రారంభం
Nalgonda MP Uttam Kumar Reddy talks with BRS leaders : సూర్యాపేట జిల్లా కోదాడలోని బీఆర్ఎస్ కీలక నేతలతో నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంతనాలు చేపట్టారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంఛార్జి కాన్మంతరెడ్డి శశిధర్ రెడ్డితో పాటు నలుగురు జడ్పీటీసీ సభ్యులు(ZPTC Members), ముగ్గురు ఎంపీపీలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. స్థానిక ఎమ్మెల్యేపై వ్యతిరేకత వల్లే పార్టీ మారుతున్నట్లు నియోజకవర్గ మాజీ ఇంఛార్జీ శశిధర్ రెడ్డి వెల్లడించారు.
కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా ఎవరైతే క్రియాశీలక పాత్ర పోషించారో.. వారందరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి నేను ఇక్కడకు వచ్చాను. కోదాడ ప్రాంతంలో జరుగుతున్న రాజకీయాలు.. కొన్ని వికృతమైన విషయాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అసంతృప్త నాయకులు శశిధర్ రెడ్డి, కొందరు జడ్పీటీసీలు, ఎంపీపీలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాను. కోదాడ అభివృద్ధికై అంతా కలిసివెళ్లాలని ఆలోచించాం. :-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్‌నేత
Caste Census Congress : కుల గణన దేశానికి 'ఎక్స్-రే' లాంటిది: రాహుల్ గాంధీ