ETV Bharat / state

NEW IT POLICY: నేడు కొత్త ఐటీ విధానాన్ని ఆవిష్కరించనున్న మంత్రి కేటీఆర్‌ - new it policy in telangana

తెలంగాణ ప్రభుత్వ నూతన ఐటీ విధానాన్ని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ఇవాళ విడుదల చేయనున్నారు. ఐదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ విధాన ఆవిష్కరణ కార్యక్రమం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ హెచ్​ఏసీసీలో జరగనుంది. ఐటీ పాలసీ ఆవిష్కరణకు ఐటీ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. 2021-26 కొత్త ఐటీ విధానాన్ని మంత్రిమండలి ఆమోదానికి అధికారులు సమర్పించగా.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ ప్రగతిభవన్​లో జరిగే సమావేశంలో దీనిని ఆమోదించనున్నారు.

KTR: రాష్ట్ర ప్రభుత్వ నూతన ఐటీ విధానాన్ని నేడు విడుదల చేయనున్న మంత్రి కేటీఆర్‌

author img

By

Published : Sep 16, 2021, 5:30 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రాధామ్య రంగాల్లో ఐటీరంగం ముందుంటుంది. వార్షిక వృద్ధి, ఐటీ ఎగుమతులు ఇలా అన్నింటా దేశ సగటును మించిన వృద్ధిని రాష్ట్ర ఐటీ రంగం నమోదు చేస్తూ వస్తోంది. రాష్ట్ర ఐటీరంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా 6.5 లక్షల మంది ఉద్యోగులు, పరోక్షంగా 20 లక్షల మంది వేతన జీవులు ఉపాధి పొందుతున్నారు. కొవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఐటీరంగం మెరుగైన ఫలితాలనే పునరావృతం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. చిన్న, మధ్యతరహా కంపెనీలతో పాటు.. గ్లోబల్ ఇన్ హౌస్ దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల విధానాలు, వేగవంత అనుమతులతో పాటు.. ఆయా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేలా ప్రత్యేక పాలసీలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది.

కొవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నా.. ప్రొడక్టివిటీ, ఎగుమతులు ఏమాత్రం తగ్గకుండా తెలంగాణ ఐటీరంగం జాతీయ సగటును మించిన వృద్ధిని సాధించింది. ఈ ఏడాది ఐటీ రంగం 12.98 శాతం వృద్ధితో.. లక్ష 45 వేల 522 కోట్ల ఎగుమతులు జరిపినట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఐటీ వార్షిక నివేదికలో పేర్కొంది. 2020-21 సంవత్సరానికి గానూ ఐటీ రంగం, అనుబంధ సేవల ద్వారా 7.99 శాతం ఉద్యోగిత పెరిగింది. అంటే ఏడాది కాలంలో కొత్తగా 46 వేల 489 ఉద్యోగాలను ఐటీ రంగం కల్పించింది.

ఇంతటి ప్రాధాన్య రంగమైన ఐటీని రాష్ట్రంలో మరింత విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2015లో ఐటీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2020తో దాని గడువు ముగిసిపోయింది. దీంతో కొత్త విధానంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరిన్ని రాయితీలు, ప్రోత్సాహకాలతో ఈ నూతన విధానాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. 2021-26 కొత్త ఐటీ విధానాన్ని మంత్రిమండలి ఆమోదానికి అధికారులు సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్​లో జరిగే సమావేశంలో దీనిని ఆమోదించనున్నారు. దీంతోపాటు కొత్త గనుల విధానాన్ని సైతం రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించనున్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి: 'అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా'లో ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.