ETV Bharat / state

నవంబర్​ 1 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం - excise policy in telangana

రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. 2,216 మద్యం దుకాణాల ఏర్పాటుకు ఈ నెల 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది ఆబ్కారీశాఖ. నాన్​ రిఫండెబుల్​ దరఖాస్తు రుసుమును రూ.2లక్షలుగా నిర్ణయించింది. ఈ నెల 18న లాటరీ విధానం ద్వారా కొత్త లైసెన్స్​దారులను ఎంపిక చేయనుంది.

New_Excise_Policy_In_Telangana_State
author img

By

Published : Oct 4, 2019, 5:59 AM IST

Updated : Oct 4, 2019, 8:24 AM IST

నవంబర్​ 1 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం

రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్​దారుల ఎంపికకు ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రకటించింది. 2019 నవంబర్​ 1 నుంచి 2021 అక్టోబర్ 31 వరకు ఈ విధానం అమల్లో ఉండనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2,216 మద్యం దుకాణాలకు ఈ నెల 9 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18న లాటరీ పద్ధతి ద్వారా కొత్త లైసెన్స్‌ దారులను ఎంపిక చేయనున్నారు.

ఆరు శ్లాబుల్లో లైసెన్స్​ రుసుం...

2019 నవంబర్​ 1 నుంచి కొత్తగా ఎంపికైన లెసెన్స్ దారులు మద్యం దుకాణాలను నిర్వహిస్తారు. లిక్కర్ మీద 27శాతం... మీడియం, ప్రీమియం రకం మద్యంపై 20శాతం... బీరుపైన 20శాతం లెక్కన ఆయా లైసెన్స్ దారుడు లాభం పొందుతాడు. గతంలో నాలుగు రకాల శ్లాబులు ఉండగా... తాజా విధానంలో 6 శ్లాబులుగా పేర్కొన్నారు. మద్యం దుకాణాల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుమును రూ.లక్ష నుంచి 2 లక్షలకు ప్రభుత్వం పెంచింది. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక దృష్ట్యా సూర్యాపేట జిల్లాలో మద్యం దుకాణాల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ అనుమతి కోరింది.

ఇవీ చూడండి: కొత్త మద్యం విధానం ప్రకటించిన ప్రభుత్వం

TG_Hyd_46_03_New_Excise_Policy_Pkg_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫైల్ విజువల్స్‌ వాడుకోగలరు. ( ) రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో 2216 మద్యం దుకాణాల ఏర్పాటుకు ఈ నెల 9వ తేదీ నుంచి అబ్కారీశాఖ దరఖాస్తులు స్వీకరిస్తుంది. వెనక్కి తిరిగి ఇవ్వని దరఖాస్తు రుసుము లక్ష నుంచి 2లక్షలకు పెంచిన ప్రభుత్వం ఈ నెల 18న లాటరీ విధానం ద్వారా కొత్త లైసెన్స్‌ దారులను ఎంపిక చేయనుంది....Look వాయిస్ ఓవర్ 01: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్ దారుల ఎంపికకు నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వచ్చె నెల 1వ తేదీ నుంచి 2021 అక్టోబర్ 31 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. ఈ మేరుకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. స్వల్ప మార్పులు చేర్పులు చేసి నూతన మద్యం విధానాన్ని ప్రకటించారు. గతంలో నాలుగు రకాల స్లాబులు ఉండగా తాజా విధానంలో 6స్లాబులుగా పేర్కొన్నారు. ఐదువేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు 50లక్షలు, 5వేల ఒకటి నుంచి 50వేల లోపు జనాభా కలిగిన ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజుకు 55లక్షలు, 50వేల నుంచి లక్ష జనాభా వరకు కలిగిన ప్రాంతాలలో 60లక్షలు, లక్ష నుంచి 5లక్షలు కలిగిన జనాభా ప్రాంతాల్లో 65లక్షలు, 5లక్షల నుంచి 20లక్షల లోపు జనాభా కలిగిన ప్రాంతాలకు 85లక్షలు...20లక్షలకు మించి జనాభా కలిగిన ప్రాంతాలలో లైసెన్స్‌ ఫీజు కోటి 10లక్షలుగా ప్రభుత్వం నిర్ధేశించింది. మద్యం దుకాణాల కోసం నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుము లక్ష నుంచి 2లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఈ నెల 9వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు అందిన దరఖాస్తులను ఈ నెల 18వ తేదీని లాటరీ ద్వారా కొత్త లైసెన్స్‌ దారులను ఎంపిక చేస్తారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్తగా ఎంపికైనా లెసెన్స్ దారులు మద్యం దుకాణాలను నిర్వహిస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10గంటల నుంచి రాత్రి 11గంటల వరకు మద్యం విక్రయాలను అనుమతిస్తారు. ఇతర ప్రాంతాల్లో ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు కొనసాగనున్నాయి. హుజూర్‌నగర్ ఉప ఎన్నిక దృష్ట్యా సూర్యాపేట జిల్లాలో మద్యం దుకాణాల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను అనుమతి కోరింది. లెసెన్స్‌దారులు శాఖాపరంగా నిర్ధేశించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. ప్రతి దుకాణదారుడు మూడు సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.దుకాణాల ముందుగాని చుట్టుపక్కల ప్రాంతంలో క్రమపద్దతిని వాహానాల పార్కింగ్ ఉండేటట్లు అయా లైసెన్స్‌దారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. లిక్కర్ మీద 27శాతం మీడియం, ప్రీమియం రకం మద్యంపై 20శాతం బీరుపైనా 20శాతం లెక్కన అయా లైసెన్స్ దారుడు లాభం పొందుతాడు.
Last Updated : Oct 4, 2019, 8:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.