రాష్ట్రంలో కరోనా రెండోదశ వ్యాప్తి పెరుగుతోంది. మార్చి ఒకటో తేదీకి రాష్ట్రంలో కేవలం 1,907 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. నేటికి వాటి సంఖ్య 6,900కు పెరిగాయి. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతికి క్రియాశీల కేసులే నిదర్శంగా నిలుస్తున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 1,078 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఈ కేసులతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 310,819కి చేరింది. తాజాగా 331 మంది కోలుకోగా... ఇప్పటి వరకు 302,207మంది కోలుకున్నారు.
తాజాగా ఆరుగురు బలి
మరో ఆరుగురిని మహమ్మారి బలితీసుకోగా... మొత్తం మరణాలు 1,712 కు పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 6,900యాక్టివ్ కేసులు ఉండగా అందులో 3,116 మంది ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 283 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీతో పాటు పలు జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నిన్న 59,705 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.
జిల్లాల్లో కేసులు ఇలా..
జిల్లాలు | కేసులు |
ఆదిలాబాద్ | 25 |
భద్రాద్రి కొత్తగూడెం | 06 |
జనగాం | 08 |
జగిత్యాల | 40 |
భూపాలపల్లి | 12 |
జోగులాంబ గద్వాల్ | 08 |
కామారెడ్డి | 23 |
కరీంనగర్ | 34 |
ఖమ్మం | 20 |
ఆసిఫాబాద్ | 02 |
మహబూబ్నగర్ | 24 |
మంచిర్యాల | 21 |
మెదక్ | 12 |
మల్కాజిగిరి | 113 |
ములుగు | 01 |
నాగర్కర్నూల్ | 12 |
నల్గొండ | 33 |
నారాయణపేట | 07 |
నిర్మల్ | 40 |
నిజామాబాద్ | 75 |
పెద్దపల్లి | 11 |
సిరిసిల్ల | 15 |
రంగారెడ్డి | 104 |
సంగారెడ్డి | 46 |
సిద్దిపేట | 14 |
సూర్యాపేట | 13 |
వికారాబాద్ | 10 |
వనపర్తి | 10 |
వరంగల్ రూరల్ | 08 |
వరంగల్ అర్బన్ | 27 |
యాదాద్రి భువనగిరి | 15 |
సుమారు 47 శాతం వారికే..
కరోనా బారిన పడుతున్న వారిలో సుమారు 47 శాతం మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వారే కావటం గమనార్హం. మహమ్మారి సోకిన వారిలో ఇటీవల చాలా స్వల్పంగానే లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏ మాత్రం కరోనా సిప్టమ్స్ ఉన్నా.. తక్షణం పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. ఫలితంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని విన్నవిస్తోంది.