ETV Bharat / state

గ్రేటర్​లో ఆసరాకు కొనసాగుతున్న కసరత్తు - ASARA

వృద్ధాప్య పింఛన్ల కొత్త లబ్ధిదారుల జాబితా గ్రేటర్ హైదరాబాద్​లో ఇంకా తేలాల్సి ఉంది. గ్రేటర్ మినహా మిగతా జిల్లాల్లో 4 లక్షల 30 వేలకు పైగా కొత్తగా పింఛన్లు అందనున్నాయి. గ్రేటర్​లోనూ లబ్ధిదారుల కసరత్తు పూర్తయితే 57 ఏళ్లు నిండిన వారికి కూడా వృద్ధాప్య ఫించన్లు రానున్నాయి.

గ్రేటర్​లో ఆసరాకు కొనసాగుతున్న కసరత్తు
author img

By

Published : May 30, 2019, 5:49 AM IST

Updated : May 30, 2019, 7:49 AM IST

గ్రేటర్​లో ఆసరాకు కొనసాగుతున్న కసరత్తు

ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ఆసరా పింఛన్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ మొత్తం జూన్ నెల నుంచి అమల్లోకి రానుండగా... లబ్ధిదారులకు జూలైలో అందనుంది. వృద్ధాప్య పెన్షన్ల అర్హతా వయస్సును 65 సంవత్సరాల నుంచి 57 ఏళ్లకు కుదించనున్నట్లు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఓటాన్ అకౌంట్​లో ఆసరా పథకానికి నిధులు కూడా కేటాయించారు. గతంలో ఆసరాకు ఏడాదికి 5 వేల కోట్ల రూపాయలు కేటాయించగా... ఈ మారు ఏకంగా 12 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. వృద్ధాప్య పెన్షన్ల అర్హతా వయస్సు తగ్గించిన నేపథ్యంలో అదనంగా లబ్ధి పొందే వారి జాబితా తయారీ కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రారంభించింది.

గ్రేటర్​లో కొనసాగుతున్న కసరత్తు!

2018 నవంబర్ 19వ తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకున్న అధికారులు పూర్తిస్థాయిలో వడబోసి కొత్త లబ్ధిదారులను గుర్తించారు. గ్రేటర్​లో కొత్త లబ్ధిదారుల సంఖ్య ఇంకా తేలాల్సి ఉండగా.. ఇందుకోసం జీహెచ్ఎంసీ పరిధిలో కసరత్తు కొనసాగుతోంది. గ్రేటర్​లోనూ ఈ గుర్తింపు పూర్తయితే... వృద్ధాప్య పింఛన్ల లబ్ధిదారుల వయస్సును కుదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

నెలకు రూ.1000 కోట్ల భారం..

జిల్లాల్లో కొత్త లబ్ధిదారుల సంఖ్య 4 లక్షల 30వేలకు పైగా ఉండగా... గ్రేటర్​లో మరో లక్షన్నర వరకు ఉండవచ్చని అంచనా. మొత్తంగా రాష్ట్రంలో ఆసరా లబ్ధిదారుల సంఖ్య 46 లక్షలకు పైగా దాటే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే రాష్ట్రంలో పదిశాతానికి పైగానే ప్రజలకు సామాజిక భద్రతా పింఛన్లు అందనున్నాయి. ప్రస్తుతం ఆసరాకు ప్రతి నెలా 440 నుంచి 450 కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. పెన్షన్ల మొత్తం రెట్టింపుతో పాటు కొత్త లబ్ధిదారుల చేరితే నెలకు 1000 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతాయని అంచనా.

ఇవీ చూడండి: జగన్, మోదీల ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న కేసీఆర్

Last Updated : May 30, 2019, 7:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.