కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులను బానిసలుగా చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ చంద్రబోస్ ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ భవన్ ఎదుట చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేశారు.
వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకే చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. భాజపా పాలనలో అన్ని వివాదాస్పద చట్టాలే వచ్చాయని ఆరోపించారు. అభివృద్ధి, సమన్యాయం, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేశారన్నారు. పంటకు కనీస మద్దతు ధర ఇవ్వలేని ప్రభుత్వం రైతులకు ఏం చేస్తుందని ప్రశ్నించారు. రైతుల జీవనోపాధిని నాశనం చేసే నూతన వ్యవసాయ, విద్యుత్ సంస్కరణల చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని బోస్ తెలిపారు.