రాష్ట్రంలో కొత్తగా 997 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడిన వారిలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 2,55,663కి చేరింది.
ఇప్పటి వరకు 1,397 మంది కరోనాతో మృతి చెందారు. మరో 1,222 మంది కోలుకోగా... మొత్తం 2,37,172 మంది బాధితులు వైరస్‌ను జయించారు. ప్రస్తుతం 17,094 యాక్టివ్ కేసులున్నాయి. హోం ఐసోలేషన్‌లో ఉంటూ 14,446 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 169 కరోనా కేసులు రాగా... రంగారెడ్డి జిల్లాలో 98.... మేడ్చల్ జిల్లాలో 97 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి : నర్సుల ‘వెయిటేజీ’లో గోల్‌మాల్.. నిలిచిన భర్తీ ప్రక్రియ