ఏపీలో గడిచిన 24 గంటల్లో 43,006 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 316 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. వైరస్ బారిన పడి ఐదుగురు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,72,288కు చేరింది.
గడిచిన 24 గంటల్లో 595 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకొని 8.59 లక్షల మంది ఇళ్లకు వెళ్లిపోయారు. తాజా మరణాలతో ఆ రాష్ట్రంలో మొత్తం 7,038 మంది కొవిడ్‌తో మృతి చెందారు. ఏపీ వ్యాప్తంగా 5,626 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 1,04,53,618 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.
- ఇదీ చూడండి: మంగళవారం 'భారత్ బంద్'- అన్ని వర్గాల మద్దతు!