ETV Bharat / state

ప్రశ్నించడమే నేను చేసిన నేరమా..? : వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి - nellore latest updates

Kotamreddy Sridhar Reddy latest comments : అమరావతి రైతుల్ని పరామర్శించడమే తాను చేసిన నేరమా అని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. సొంత పార్టీలో అనుమానాలను భరించలేకనే బయటకు రావాలన్న నిర్ణయానికి వచ్చానని తెలిపారు. నెల్లూరు రూరల్‌ పరిధిలోని 21వ డివిజన్‌లో కోటంరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
author img

By

Published : Feb 8, 2023, 12:51 PM IST

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆత్మీయ సమావేశం

Kotamreddy Sridhar Reddy latest comments : అధికార పార్టీలో ఉంటూ.. ప్రజాసమస్యలను ప్రశ్నించడం, అమరావతి రైతుల్ని పరామర్శించడమే తాను చేసిన నేరమా అని.. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. తన ఫోన్‌ సంభాషణల్ని చాటుగా వినాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. నెల్లూరు రూరల్‌ పరిధిలోని 21వ డివిజన్‌లో కోటంరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

సొంత పార్టీలో అనుమానాలను భరించలేకనే బయటకు రావాలన్న నిర్ణయానికి వచ్చానని కోటంరెడ్డి తెలిపారు. ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నెల్లూరు రూరల్‌ ఇన్‌ఛార్జ్‌గా నియమించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. రూరల్‌ నియోజకవర్గం నుంచి తనను వేరు చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.

"నిజంగా ఒక శాసనసభ్యుడు.. అమరావతి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని తెలిసినా.. కష్టాల్లో ఉన్నారని పరామర్శిస్తే దాని వలన ముఖ్యమంత్రి జగన్ గారి గౌరవం పెరుగుతుంది కానీ ఎలా తగ్గుతుందని ప్రశ్నిస్తున్నాను. ఆరోజు నుంచి వేధింపులు". - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ తిరుగబాటు ఎమ్మెల్యే

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.