ETV Bharat / state

'ముక్కుసూటిగా మాట్లాడే రాజకీయ నాయకుడు.. నాయిని' - nayini narasimha reddy death

హైదరాబాద్​లో దృశ్య మాధ్యమం ద్వారా నాయిని నరసింహారెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ సంస్మరణలో బోయినపల్లి వినోద్‌కుమార్‌తో పాటు తెతెదేపా అధ్యక్షుడు ఎల్‌. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు. నాయిని మృతి యావత్​ తెలంగాణకు బాధాకరమైన రోజని నేతలు తెలిపారు.

nayini narasimha reddy online condolence meeting
'ముక్కుసూటిగా మాట్లాడే రాజకీయ నాయకుడు.. నాయిని'
author img

By

Published : Oct 22, 2020, 10:20 PM IST

మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి మృతి కార్మికలోకానికే కాదు యావత్‌ తెలంగాణకు బాధాకరమైన రోజని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే రాజకీయ నాయకుల్లో నాయిని నరసింహారెడ్డి ఒక్కరన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ఎలాంటి రాజీ పడని వ్యక్తని కొనియాడారు. దృశ్య మాధ్యమం ద్వారా నాయిని నరసింహారెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ సంస్మరణలో బోయినపల్లి వినోద్‌కుమార్‌తో పాటు తెతెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు.

మంచి విలువలున్న నాయకుడని కోల్పోయామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారని కొనియాడారు. నాయిని నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన వ్యక్తని తెతెదేపా అధ్యక్షుడు ఎల్‌. రమణ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్ర పోషించారని గుర్తు చేశారు. బడుగు, బలహీనవర్గాల కోసం పనిచేసిన ఆయన చరిత్రలో నిలిచిపోతారన్నారు. నాయిని ఆశయసాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి: కార్మిక ఆత్మబంధువుకు కడసారి వీడ్కోలు... నేతల ఘననివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.