Case against Heera Group: మనీలాండరింగ్ కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ ఈరోజు హైదరాబాద్‌లోని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. ఆస్తుల జప్తు విషయంలో సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా రావడంతో.. ఈడీకి ఆ పత్రాలు సమర్పించేందుకు ఆమె కార్యాలయానికి వచ్చారు. "ఇటీవలే ఈడీ తమ ఆస్తులు జప్తు చేసిందని.. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో సవాల్ చేయగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని" ఆమె తెలిపారు.
36 శాతం వడ్డీ ఇస్తామని ప్రజల నుంచి 5 వేల కోట్ల సేకరించి.. తిరిగి చెల్లించకపోవడంతో హైదరాబాద్ సీసీఎస్‌లో గతంలో కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగా డబ్బును విదేశాల్లో షెల్ కంపెనీలకు మళ్లించడంతో.. 2018లో మనీలాండరింగ్ కింద ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా పలు ఆస్తులను జప్తు చేసింది.
"ఇటీవల మా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. సుప్రీంకోర్టులో తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది. తీర్పు పత్రాలను ఈడీకి సమర్పించేందుకు వచ్చాను". -నౌహీరా షేక్, హీరా గ్రూప్ అధినేత
ఇవీ చదవండి: