ETV Bharat / state

Natural Ways To Get Rid Of Mosquitoes in Telugu : వానాకాలంలో దోమల బెడద నుంచి తప్పించుకోవాలా.. ఈ టిప్స్ ట్రై చేయండి

Natural Ways To Get Rid Of Mosquitoes in Telugu : ఈ వర్షాకాలంలో ఎక్కడికక్కడ నీరు నిలిచి దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలు కుట్టడం వల్ల మలేరియా, డెంగీ వంటి వ్యాధుల బారిన పడుతుంటారు. అందుకే వర్షాకాలంలో దోమల బెడద నుంచి తప్పించుకోవడానికి.. మస్కిటో మ్యాట్​, దోమల చక్రాలు వంటివి ఉపయోగిస్తుంటాం. కానీ ఇవి అన్నీ దోమలను చంపడమేమో గానీ.. వాటి నుంచి వచ్చే రసాయనాల వల్ల ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు. ప్రకృతి సిద్ధంగా దొరికే వాటితో దోమల బెడద లేకుండా ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందామా..?

Mosquitoes
Natural Ways To Get Rid Of Mosquitoes in Telugu
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 22, 2023, 2:17 PM IST

Natural Ways To Get Rid Of Mosquitoes in Telugu : సాయంత్రం 6 గంటలు దాటితే చాలు దోమల దండయాత్ర మొదలవుతుంది. ఆ దోమల వల్ల వచ్చే వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి ఆల్​ అవుట్​, గుడ్​ నైట్​ వంటి దోమలను సంహరించే రసాయనిక వస్తువులను వాడుతాం. అవి వాటిని చంపడమేమో గానీ.. మొదట మన ప్రాణాలనే హరిస్తాయి. దోమకాటు కొన్ని వారాలకు ఎఫెక్టు చూపితే.. ఈ రసాయనాల వల్ల దీర్ఘకాలంలో తీవ్రమైన వ్యాధులు సంభవిస్తాయి. అలాంటి రసాయనాలకు బదులుగా ప్రకృతి సిద్ధమైన వాటితో దోమల బెడద నుంచి శాశ్వతంగా ముక్తి పొందుదాం. అవేంటో తెలుసుకుందాం రండి..

కర్పూరం, వేప ఆకులు : ప్రతిరోజు రాత్రి వేళల్లో మస్కిటో కాయిల్స్​ వెలిగించే బదులు.. తలుపులు, కిటికీలు కాస్త మూసి కర్పూరం, వేప ఆకులు కలిపి పదిహేను నిమిషాల పాటు పొగ వేస్తే చాలు.. దోమల అనేది ఇంట్లో అడుగు పెట్టాలంటే భయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఒక వేళ వేపాకులు లేకపోతే సింపుల్​గా కర్పూరంతో పొగ వేస్తే సరిపోతుంది.

వేప నూనె
వేప నూనె

ఆవాల పొడి, వేప ఆకుల పొడి, సముద్రపు ఉప్పు ఈ మూడింటిని సమాన మోతాదులో తీసుకుని.. తర్వాత నాలుగు బొగ్గులను వేడి చేసుకొని ఒక మట్టిపాత్రలో వేసుకోవాలి. కిటికీలు, తలుపులు అన్నీ మూసి పొడిని కొంచెం కొంచెంగా బొగ్గులపై చల్లుకుంటూ వెళ్లాలి. ఇలా వచ్చే పొగను ఇల్లంతా విస్తరించనివ్వాలి. ఈ ఔషధం కూడా దోమల్ని తరిమికొడుతుంది.

యూకలిప్టస్​ ఆయిల్​
యూకలిప్టస్​ ఆయిల్​

బొగ్గు అందుబాటులో లేకపోతే అరోమాల్యాంప్స్​ : ఒకవేళ బొగ్గు అందుబాటులో లేకపోతే అరోమా ల్యాంప్స్​లో కర్పూరం, సాంబ్రాణి, యూకలిప్టస్​ ఆయిల్​, వేప నూనె, లెమన్​ గ్రాస్​ నూనె, లావెండర్​ నూనె, తేయాకు నూనె.. వీటన్నింటిలో ఏదో ఒకటి వేసుకుంటే సరిపోతుంది. వీటి వల్ల గది మొత్తం సువాసన వెదజల్లడమే కాదు దోమల బెడదా ఉండదు.

వెల్లుల్లిపాయలు : నాలుగు వెల్లుల్లిపాయలను తీసుకొని వాటిని బాగా దంచి, ఏదైనా కొంచెం నూనె లేక నెయ్యితో పాటు కాస్త కర్పూరం కలుపుకొని వెలిగించుకోవాలి. అప్పుడు వచ్చే పొగకు దోమలు చనిపోతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. మస్కిటో మ్యాట్స్​, లిక్విడ్​ రీఫిల్స్​ కంటే ఈ చిట్కా చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని చెబుతున్నారు.

వేప మొక్కలు
వేప మొక్కలు

వేపనూనె, కొబ్బరి నూనె మిక్సింగ్​ : వేప నూనెకు అంతే మోతాదులో కొబ్బరి నూనె కలిపి శరీరానికి రాసుకొని.. అలాగే పడుకుంటే దాదాపు ఎనిమిది గంటల వరకూ ఎలాంటి దోమలు కుట్టకుండా కాపాడుకోవచ్చు.

ఎప్సమ్​ సాల్ట్​ : మూడు టేబుల్​ స్పూన్ల ఎప్సమ్​ సాల్ట్​ను ఒక బకెట్​ గోరు వెచ్చని నీటిలో వేసుకొని స్నానం చేసినా దోమ కాటు నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

తులసి రసం, నీరు నిల్వలేకుండా జాగ్రత్తలు : ఇంటి సమీపంలోనూ, ఇంట్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ నీరు నిలిస్తే.. ఆనీటిపై, దోమలున్న ప్రాంతంలో తులసి రసాన్ని చల్లితే ఆ ఫలితం చూడవచ్చు.

తులసి ఆకులు
తులసి ఆకులు

ఇంటి ఆవరణలో ఈ మొక్కలను తప్పకుండా పెంచుకోవాలి : ఇంటి చుట్టూ వేప, తులసి, యూకలిప్టస్​ వంటి చెట్లు ఉంటే దోమల శాతం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. లేకపోతే ఒక కుండీలో కలబంద మొక్కను పెంచుకుంటే దోమ కాటుకి మందుగా ఉపయోగపడుతోంది. దోమ కుట్టిన ప్రాంతంలో కలబంద గుజ్జును రాస్తే.. వెంటనే ఉపశమనం లభిస్తుంది. లేకపోతే తులసి ఆకులు లేదంటే వేప ఆకులు పేస్ట్​ని దోమ కుట్టిన ప్రాంతంలో రాస్తే.. దద్దుర్లు, దురద వంటివి లేకుండా జాగ్రత్త పడొచ్చు.

దోమలకు కొందరే ఎందుకు ఇష్టం?.. వారినే ఎందుకు టార్గెట్ చేస్తాయి?

దోమలకి మనిషి రక్తమే ఎందుకు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.