ETV Bharat / state

'వ్యవసాయరంగ సమస్యలపై దేశవ్యాప్త నిరసన'

వ్యవసాయ రంగంలో రైతులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సెప్టెంబరు 5న దేశవ్యాప్తంగా  నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్లు ఏఐకేస్​ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ హన్నన్ ముల్ల తెలిపారు. ఆర్టీసీ క్రాస్​రోడ్స్​లో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం సమావేశాల్లో ముఖ్య అతిథిగా హజరయ్యారు.

'వ్యవసాయరంగ సమస్యలపై సెప్టెంబర్​ 5న దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీ'
author img

By

Published : Aug 22, 2019, 7:51 PM IST

వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై సెప్టెంబరు 5న దేవవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్లు అఖిల భారత కిసాన్​సభ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ హన్నన్​ ముల్ల తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్​రోడ్స్ ఎంబీ భవన్‌లో రెండు రోజులుగా జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల ప్రభావంతో వ్యవసాయ, ఉద్యాన పంటలు నష్టపోయినప్పుడు రైతులకు పరిహారం చెల్లింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండిచేయి చూపడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

తెలంగాణలో వర్షాభావం, కరవు, సంస్థాగత రుణాలు, రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీ తదితర పథకాలు అమలు లోపభూయిష్టంపై సమావేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2014, 2019 ఎన్నికల్లో నరేంద్రమోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని హన్నన్ ముల్ల ఆక్షేపించారు. వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యల నుంచి గట్టెక్కించాలంటే స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా పెట్టుబడి ఖర్చుకు అదనంగా 50 శాతం కలిపి కనీస మద్దతు ధరలు నిర్ణయించి అమలుచేయాలని హన్నన్ ముల్ల డిమాండ్‌ చేశారు. రాబోయే రోజుల్లో రైతు ఉద్యమాలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, సహాయ కార్యదర్శి విజ్జు కృష్ణన్, తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి తీగల సాగర్, వివిధ జిల్లాల నుంచి రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

'వ్యవసాయరంగ సమస్యలపై సెప్టెంబర్​ 5న దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీ'
ఇదీ చూండండి: లోటు వర్షపాతంతో పంట పండేదెలా...?

Intro:TG_ADB_06_22_PULI_DAADI_TS10029
ఏ.అశోక్, ఆదిలాబాద్, 8008573587
----------------------------------------------------------
(): ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ తాంసీ పరిసర ప్రాంతాల్లో పులి లేగదూడను హతమార్చడం కలకలం రేపుతోంది. ఈ ఘటనతో పరిసర గ్రామాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఘటన స్థలానికి వెళ్లిన అటవీ అధికారులు లేగదూడ ను హతమార్చింది పులినని నిర్ధారణకు వచ్చారు. ఇటీవల ఈ సంచరిస్తున్నట్లు ప్రచారం జరగడాన్ని కొట్టిపారేసిన అధికారులు తాజా ఘటనతో అప్రమతమయ్యారు. సీసీ కెమెరాల బిగించి పులి సంచారాన్ని కనుగొని పనిలో నిమగ్నమయ్యారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేయడంతో పంట చేల కు వెళ్లేందుకు రైతులు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. సరిహద్దు మహారాష్ట్రలోని తిప్పే శ్వర్ అటవీ ప్రాంతం నుంచి పెన్గంగ నుంచి చి తాంసి అటవీ ప్రాంతం వైపు వచ్చినట్లుగా అటవీ అధికారులు భావిస్తున్నారు.....vsssBody:5Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.