ETV Bharat / state

హోంమంత్రిని కలిసిన జాతీయ మైనార్టీ కమిషన్​ వైస్​ ఛైర్మన్​

జాతీయ మైనార్టీ కమిషన్ వైస్ ఛైర్మన్ అతీఫ్ రషీద్... హోంమంత్రి మహమూద్​ అలీని కలిశారు. హైదరాబాద్​లోని మంత్రుల క్వార్టర్స్​లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో మైనార్టీల కోసం సంక్షేమం తీసుకున్న చర్యలను ఆయనకు మంత్రి వివరించారు.

National Minority Commission Vice Chairman met the Home Minister
హోంమంత్రిని కలిసిన జాతీయ మైనార్టీ కమిషన్​ వైస్​ ఛైర్మన్​
author img

By

Published : Jan 30, 2021, 10:38 PM IST

ముస్లింల సంక్షేమానికి తెలంగాణ ఒక రోల్ మోడల్‌గా మారిందని జాతీయ మైనార్టీ కమిషన్ వైస్ ఛైర్మన్ అతీఫ్ రషీద్ పేర్కొన్నారు. హైదరాబాద్​లోని మంత్రుల క్వార్టర్స్​లో హోంమంత్రి మహమూద్​ అలీని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్రంలో ముస్లింల కోసం ప్రారంభించిన విద్యా, సంక్షేమ పథకాలు ఆర్చర్యాన్ని కలిగించాయని రషీద్​ పేర్కొన్నారు. తెలంగాణ అధికారిక పర్యటనలో ఉన్న రషీద్.. రాష్ట్రంలోని వివిధ విభాగాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే మహమూద్​ అలీని కలిశారు.

రూ.4,945 కోట్లు ఖర్చు..

ప్రత్యేక రాష్ట్రం అవతరించాక రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీల కోసం సుమారు రూ.4,945 కోట్లు ఖర్చు చేశామని రషీద్​కు హోంమంత్రి వివరించారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఉర్దూను రెండో అధికారిక భాషగా చేస్తూ.. మొదటిసారిగా 66 మంది ఉర్దూ అధికారులను నియమించామని తెలిపారు.

ఇదీ చూడండి: నగరంలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.