ETV Bharat / state

MLA Roja Playing Kabaddi: తిరుపతిలో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా - nagari mla roja kabaddi

MLA Roja Playing Kabaddi: ఏపీలోని తిరుపతి ఇందిరా మైదానంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. మూడో రోజు జరుగుతున్న క్రీడలను ఎంపీ మిథున్ రెడ్డి, వైకాపా ఎమ్మెల్యే రోజా వీక్షించారు.

Roja Playing Kabaddi
Roja Playing Kabaddi
author img

By

Published : Jan 8, 2022, 10:14 PM IST

తిరుపతిలో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

MLA Roja Playing Kabaddi: తిరుపతి ఇందిరా మైదానంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో వైకాపా ఎమ్మెల్యే రోజా సందడి చేశారు. కాసేపు కబడ్డీ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. తిరుపతిలో మహిళల, పురుషుల కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. మూడో రోజు ప్రారంభమైన ఈ క్రీడలను వీక్షించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా వచ్చారు.

జాతీయ స్థాయి క్రీడలు తిరుపతిలో నిర్వహించడం గర్వించదగ్గ విషయమని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు క్రీడలను నిర్వహించడం శుభ పరిణామమన్నారు. తెలుగు భాష, సంస్కృతితో పాటు క్రీడల నిర్వహణకు అత్యంత చొరవ చూపిన తిరుపతి ఎమ్మెల్యేను ఆయన అభినందించారు.

క్రీడల ద్వారానే ఆరోగ్యవంతమైన జీవితం సాధ్యమన్నారు నగరి శాసన సభ్యురాలు రోజా. క్రీడలలో ఉత్తమ ప్రతిభ చూపినవారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారన్న ఆమె.. క్రీడాకారులతో కబడ్డీ ఆడి ఉత్సాహం నింపారు. జాతీయ క్రీడలు తిరుపతిలో నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు.

ఇదీ చూడండి: Rythu Bandhu Sambaralu until sankranthi : 'సంక్రాంతి వరకు రైతుబంధు ఉత్సవాలు జరుపుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.