ETV Bharat / state

ఏలూరులో వింతవ్యాధిపై పరిశోధనకు జాతీయ సంస్థలు - ఏలూరు వింత వ్యాధి వార్తలు

ఏపీ ఏలూరులో వింతవ్యాధిపై జాతీయ సంస్థలు పరిశోధనలను కొనసాగిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా వైద్యవిధాన పరిషత్‌, డీసీహెచ్‌ఎస్‌తో సమావేశమయ్యాయి. క్షేత్రస్థాయిలో పర్యటించి జాతీయ సంస్థలు నివేదిక ఇవ్వనున్నాయి.

eluru
ఏలూరులో వింతవ్యాధిపై పరిశోధనకు జాతీయ సంస్థలు
author img

By

Published : Dec 10, 2020, 3:50 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వ్యాప్తి చెందిన వింతవ్యాధిపై జాతీయ సంస్థలు పరిశోధనలు సాగిస్తున్నాయి. జిల్లా వైద్యవిధాన పరిషత్‌, డీసీహెచ్‌ఎస్‌తో జాతీయ సంస్థలు సమావేశమయ్యాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌, దిల్లీ ఎయిమ్స్‌, వ్యవసాయశాఖలు.. వ్యాధి సోకడానికి గల కారణాలపై పరిశోధనలు చేపట్టాయి. బాధితుల శరీరాల్లో క్రిమిసంహారక అవశేషాలు ఉండడం వల్ల.. వ్యవసాయ శాఖను కూడా ఇందులో చేర్చారు.

ఈ నాలుగు బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యాధి వ్యాప్తికి గల కారణాలను విశ్లేషించి నివేదికను.. ప్రభుత్వానికి అందజేయనున్నాయి. అయితే భారలోహాలైన సీసం, నికెల్,‌ క్రిమిసంహారక అవశేషాలు, ఆర్గనో క్లోరిన్స్ వంటివి.. వ్యాధికి కారణమని కొన్ని నివేదికలు వచ్చాయి. ఆహారం, తాగునీరు, పాలు, కూరగాయలు, ఆకుకూరల ద్వారా బాధితుల శరీరంలోకి చేరి ఉండొచ్చని.. ఇప్పటికే దిల్లీ ఎయిమ్స్‌, ఐఐసీటీ, ఎన్‌ఐఎన్‌లు తమ పరిశోధనలో తేల్చాయి.

ఇదీ చదవండి: అభివృద్ధితో విమర్శకుల నోళ్లు మూయించాం: హోంమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.