ETV Bharat / state

7 జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులను కైవసం చేసుకున్న దక్షిణ మధ్య రైల్వే - recent Railway Received Awards

National Energy Conservation Awards 2023 : జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా న్యూదిల్లీలో విజ్ఞాన్​ భవన్​లో భారత ప్రభుత్వ విద్యుత్​ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్​ ఎనర్జీ ఎఫిషియెన్సీ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే ఏడు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతులమీదుగా ప్రధానం చేశారు.

South Central Railway Received Seven National Energy Conservation Awards
South Central Railway
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 15, 2023, 2:03 PM IST

National Energy Conservation Awards 2023 : దక్షిణ మధ్య రైల్వే ఏడు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డులను కైవసం చేసుకుంది. న్యూదిల్లీలోని విజ్ఞాన్‌భవన్​లో భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఈ అవార్డులను ప్రదానం చేశారు.

ఇంధన సంరక్షణ, అందుబాటులో ఉన్న శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో అద్భుతమైన పని తీరును కనబరిచిన వివిధ పారిశ్రామిక యూనిట్లు, స్థాపనలు, సంస్థలు చేస్తున్న కృషిని గుర్తించేందుకు ప్రతి సంవత్సరం జాతీయ ఇంధన సంరక్షణ అవార్డులను అందజేస్తున్నారు.

శరవేగంగా ముంబయి-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు- కీలక మైలురాయన్న రైల్వే మంత్రి

President Droupadi Murmu Presented The Awards : ఇంధన సంరక్షణలో దక్షిణ మధ్య రైల్వే గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నుంచి ఈ అవార్డులను వరుసగా గెలుచుకుంటుంది. దిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్​తో పాటు, విజయవాడ డివిజన్‌కు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఎ.పాటిల్‌ విజయవాడలోని వ్యాగన్ డిపోకు మొదటి బహుమతిని, దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పి.డి మిశ్రా, సికింద్రాబాద్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ భరతేష్‌ కుమార్‌ జైన్‌ హైదరాబాద్‌ పీఆర్‌ఎస్‌ బిల్డింగ్‌కు మొదటి బహుమతిని అందుకున్నారు. దక్షిణ మధ్య రైల్వేలోని ఇతర సీనియర్ అధికారులు సంబందిత ఇంధన సామర్థ్య యూనిట్లకు సంబంధించిన అవార్డులు అందుకున్నారు.

దక్షిణ మధ్య రైల్వే ఈ సంవత్సరం సాధించిన జాతీయ ఇంధన సంరక్షణ అవార్డులు :

1. ప్రభుత్వ కార్యాలయాల విభాగంలో హైదరాబాద్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పి.ఆర్.ఎస్) భవనం ప్రథమ బహుమతి సాధించింది.

2. రైల్వే వర్క్ షాప్ విభాగంలో విజయవాడలోని వ్యాగన్ డిపో ప్రథమ బహుమతి కైవసం చేసుకుంది.

3. జోనల్ రైల్వేల విభాగంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు ద్వితీయ బహుమతి లభించింది.

4. ప్రభుత్వ కార్యాలయాల వర్గంలో లేఖ భవన్ (దక్షిణ మధ్య రైల్వే అకౌంట్స్ ఆఫీస్ భవనం) రెండవ బహుమతిని పొందింది.

5. ప్రభుత్వ కార్యాలయాల విభాగంలో రేణిగుంట రన్నింగ్ రూమ్ మెరిట్ సర్టిఫికేట్ పొందింది.

6. గుంతకల్ రన్నింగ్ రూమ్ ప్రభుత్వ కార్యాలయాల విభాగంలో మెరిట్ సర్టిఫికేట్ పొందింది.

7. ప్రభుత్వ కార్యాలయాల విభాగంలో గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం మెరిట్ సర్టిఫికేట్ పొందింది.

SCR Extends Festive Special Trains : పండగ స్పెషల్.. ఆ రైళ్లు పొడిగింపు..!

Ajanta Express departs from Kachiguda station : ఇదిలా ఉండగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​పై ఒత్తిడి తగ్గించేందుకు రెండు ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రారంభ టెర్మినళ్లను మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దేవగిరి ఎక్స్ ప్రెస్ ఇకనుంచి లింగంపల్లి స్టేషన్ నుంచి, అజంతా ఎక్స్ ప్రెస్ కాచిగూడ స్టేషన్ నుంచి ప్రారంభమవుతాయి. అజంతాకు మాల్కాజ్ గిరి స్టేషన్​లో అదనపు హోల్ట్ ఇచ్చారు. దేవగిరిని లింగంపల్లి స్టేషన్​కు మార్చడం వల్ల నిజామాబాద్, బాసర, నాందేడ్, మన్మాడ్, నాసిక్ పట్టణాలకు వెళ్లే ప్రయాణికులకు నేరుగా రైలు అనుసంధానం లభిస్తుంది.

Devagiri Express Departs From Lingampally station : అజంతాతో కాచిగూడ స్టేషన్ నుంచి శిరిడీకి సమీప రైల్వే స్టేషన్ నాగర్ సోల్ అనుసంధానమవుతుంది. దేవగిరి ఎక్స్ ప్రెస్ టెర్మినట్ మార్పు ఈనెల 14 నుంచి అమల్లోకి వస్తుంది. ఈరైలు లింగంపల్లిలో మధ్యాహ్నం 12:25 గంటలకు బయలుదేరుతుంది. కాచిగూడ -మన్మాడ్ అజంతా ఎక్స్ ప్రెస్ మార్పు ఈనెల 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ రైలు కాచిగూడ నుంచి సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.