కరోనా ఔషధాలపై జాతీయ ఔషధ నియంత్రణ సంస్థ.. హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. కరోనా మందులు అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చాలన్న అంశంపై నివేదిక సమర్పించింది. దానిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
కరోనా మందులను అత్యవసర జాబితాలో చేర్చగలరా లేదా సూటిగా చెప్పాలని హైకోర్టు నిలదీసింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని ఎన్‌పీపీఏ డైరెక్టర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ప్రజల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.