ETV Bharat / state

'మేడిగడ్డ బ్యారేజీ ఘటనలో నిజాలే చెప్పాం - నిరాధార ఆరోపణలు చేయలేదు' - మేడిగడ్డ బ్యారేజీ లోపాలు

National Dam Safety Authority on Medigadda Barrage : వాస్తవాలను పరిగణనలోకి తీసుకునే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి గల కారణాలను చెప్పామని.. ఎలాంటి నిరాధార ఆరోపణలు చేయలేదని నేషనల్​ డ్యాం సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసింది. బ్యారేజీ డిజైన్​తో సహా పలు లోపాలను వివరిస్తూ తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఆ లేఖలో ఏం చెప్పిందంటే..?

National Dam Safety Authority on Medigadda Barrage
National Dam Safety Authority Letter to Telangana Government
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2023, 10:51 AM IST

National Dam Safety Authority on Medigadda Barrage : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్‌ కుంగడానికి గల కారణాలను వాస్తవాలను పరిగణనలోకి తీసుకొనే చెప్పామని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపింది. తాము నిరాధార ఆరోపణలు చేశామనడం సరైంది కాదని పేర్కొంది. ప్రాజెక్టు ప్రణాళిక, డిజైన్‌.. క్వాలిటీ కంట్రోల్‌, నిర్వహణలో లోపాలున్నాయని తేల్చి చెప్పింది.

National Dam Safety Authority Letter to Telangana : నివేదికలో తాము లేవనెత్తిన అంశాలకు కట్టుబడి ఉన్నామని.. అయితే తాము పేర్కొన్న అంశాలకు తెలంగాణ సమాధానం ఇవ్వలేదని నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ సంజయ్‌కుమార్‌ సిబల్‌ అన్నారు. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ సూచన మేరకు మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage Design Errors) ఏడో బ్లాక్‌లో కుంగిన వంతెనను, దెబ్బతిన్న పియర్స్‌ను పరిశీలించిన నిపుణుల కమిటీ ప్రణాళిక, డిజైన్‌తో సహా పలు లోపాలను ఉన్నాయని వెల్లడించిన విషయం తెలిసిందే.

మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై పర్యావరణ నిపుణుల హెచ్చరిక

మేడిగడ్డపై అధికారుల దృష్టి, దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతులు!

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంపై రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వివరణ ఇస్తూ ఆరోపణలు చేశారు. అంశాల వారీగా సమాధానమిచ్చారు. ఈ విషయంపై నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ(National Dam Safety Authority Report on Medigadda Barrage) తిరిగి సమగ్ర సమాధానం లేఖ రూపంలో ఇచ్చింది. ఆ లేఖలోని వివరాలు ఇవే..

  • మేడిగడ్డ బ్యారేజీ పియర్స్‌ కుంగడంపై కమిటీ అధికారులు పేర్కొన్న అంశాలకు తెలంగాణ సమాధానం ఇవ్వలేదు.
  • వైఫల్యాలకు గల కారణాలపై సమగ్రంగా పరిశీలన చేపట్టాలని సూచించాం.
  • డిజైన్‌, ప్లానింగ్‌, క్వాలిటీ కంట్రోల్‌ ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌లో లోపాలను తెలియజేశాం.
  • ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ ఎగువన కదిలాయి. వీటికి పగుళ్లు ఏర్పడడంతో పాటు పక్కన దెబ్బతిన్నాయి. బ్యారేజీ రాప్ట్‌ కదలడం వల్ల ఇది జరిగింది.
  • వైఫల్యానికి గల కారణాలను చెప్పి సాంకేతిక కారణాలను తెలుసుకొనేందుకు సమగ్ర పరిశీలన చేయమన్నాం. దీనివల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
  • మేం నిజాలను దృష్టిలో పెట్టుకుని చెప్పాం తప్పా.. నిరాధార ఆరోపణలు చేయలేదు. ఈ బ్యారేజీపై ముఖ్యమైన సమాచారం కోరితే ఇప్పటికీ ఇవ్వలేదు.
  • పియర్స్‌ పునరుద్ధరణ పనులు చేపట్టే ముందు కారణాలు స్పష్టంగా తెలుసుకోవాలి. బ్యారేజిని ఫ్లోటింగ్‌ స్ట్రక్చర్‌గా డిజైన్‌ చేశారు. కానీ నిర్మాణం మాత్రం దీని ప్రకారం జరగలేదు.
  • దిగువన, ఎగువన కట్‌ ఆఫ్‌ వాల్‌ సీకెంట్‌ పైల్స్‌ కింద రాయి వరకు తీసుకెళ్లారు. దీనివల్ల బ్యారేజీపై ఒత్తిడిలో మార్పు వచ్చింది.
  • సీకెంట్‌ పైల్స్‌కు సంబంధించి క్వాలిటీ కంట్రోల్‌ డేటా లేదు. లాంచింగ్‌ ఆఫ్రాన్స్‌, సిమెంట్‌ కాంక్రీట్‌ బ్లాక్స్​లను తనిఖీ, నిర్వహణ జరగలేదు. ఇది ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌లో లోపం.
  • ప్రాజెక్టు డీపీఆర్‌ పరిశీలన సమయంలో డిజైన్‌ను కేంద్ర జలసంఘం అప్రయిజల్‌ చేయలేదు.
  • రాష్ట్రంలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) ఇచ్చిన సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకొన్నాం.

అన్నారం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర డ్యాంసేఫ్టీ బృందం

'మేడిగడ్డ ప్రాజెక్టును డబ్బు, కమీషన్ల కోసం తొందరగా పూర్తి చేశారు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.