హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదైంది. అమెజాన్ సంస్థలో పనిచేసే ప్రతీక్ పాండా ఈ నెల 29న అదృశ్యమయ్యాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోకాపేటలోని సెవెన్‌హిల్స్ అపార్ట్మెంట్ నుంచి కిడ్నాప్‌కు గురైయ్యాడనీ పోలీసులకు తెలిపాడు. ఎంఎస్ కోసం అమెరికా వెళ్లేందుకు కోటి నలభై లక్షలు డిపాజిట్ చేయాలని డబ్బులు తల్లిదండ్రుల నుంచి తీసుకున్నట్టు వెల్లడించారు.
మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు చెందిన ప్రతీక్ తండ్రి భగీరథ పాండా.. నార్త్ ఈస్టర్న్ నెహ్రు యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. నార్సింగి పోలీసులు మిస్సింగ్ కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : బీసీల సమస్యలపై ఆగస్టు 7న జాతీయ సదస్సు