ETV Bharat / state

మూడో రోజు కూడా నోరు మెదపలే.. - నర్సాపూర్​ లంచం కేసు

నిరభ్యంతర పత్రం(ఎన్​వోసీ) జారీకి భారీగా లంచం డిమాండు చేసిన కేసులో అరెస్టయిన మెదక్​ అదనపు కలెక్టర్​ నగేష్​తో పాటు బినామీలను అధికారులు మూడో రోజూ విచారించారు. మూడోరోజూ కూడా వారు మూగనోమే వహించారు. రూ.1.12 కోట్ల లంచం వ్యవహారంపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఐదుగురు నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది.

narsapur bribe case latest news
మూడో రోజు కూడా నోరు మెదపలే..
author img

By

Published : Sep 24, 2020, 3:55 AM IST

మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. కస్టడీలో భాగంగా మూడో రోజు నగేశ్, అతని బినామీలను ప్రశ్నించిన అనిశా అధికారులు.. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల అపార్టుమెంట్లతో పాటు... శివారు ప్రాంతాల్లో భూములు కూడబెట్టినట్లు వివరాలు సేకరించారు. దాదాపు 5మందికి పైగా బినామీలను అనిశా అధికారులు కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించారు. వీరిలో నిర్మల్, మెదక్​కు చెందిన వాళ్లున్నారు. నిర్మల్ ఆర్డీవోగా పనిచేసిన సమయంలో నగేశ్​కు జీవన్ గౌడ్​తో పాటు మరో ఇద్దరు పరిచయమయ్యారు. నిర్మల్ చుట్టుపక్కల గ్రామాల్లో వివాదాస్పద భూములు తీసుకొచ్చి... సెటిల్ చేయడం ద్వారా జీవన్​తో పాటు మరో ఇద్దరు బినామీలు డబ్బులు తీసుకునేవాళ్లు. వచ్చిన డబ్బులో సింహభాగం నగేశ్​కు ఇచ్చి... మిగతా డబ్బులను వాళ్లు తీసుకునే వాళ్లు. అదే సాన్నిహిత్యంతో నగేశ్ వాళ్ల పేరు మీదే ఆస్తులు కొనుగోలు చేశాడు.

మెదక్​కు అదనపు కలెక్టర్​గా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మరో ఇద్దరు బినామీలను ఏర్పరచుకున్నాడు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. నర్సాపూర్ మండలం చిప్పల్​తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమి విషయంలో బాధితుడు లింగమూర్తితో నగేశ్ పలుమార్లు అప్పటి కలెక్టర్ పేరును ప్రస్తావించాడు. ఈ విషయాన్ని నగేశ్​ను అనిశా అధికారులు పలుమార్లు ప్రశ్నించినా నోరు మెదపడం లేదు. లింగమూర్తి నుంచి తీసుకున్న 40లక్షల నగదు గురించి కూడా నోరు మెదపడం లేదు. బోయిన్​పల్లిలోని ఆంధ్రాబ్యాంకులో ఉన్న లాకర్ గురించి నగేశ్ సమాధానం ఇవ్వకపోవడం వల్ల బ్యాంకు అధికారుల సాయంతో అనిశా అధికారులు తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఐదుగురు నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవో అరుణా రెడ్డితో పాటు మరో ముగ్గురు నిందితులను నేడు సాయంత్రం 5గంటల లోపు న్యాయస్థానంలో హాజరుపర్చి... అక్కడి నుంచి చంచల్​గూడ జైలుకు తరలించనున్నారు.

ఇవీ చూడండి: మూడో రోజు విచారణ.. నగేశ్​ బ్యాంకు లాకర్​ తెరిచే అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.